×
Ad

Tammareddy Bharadwaj : సినిమా ఇండస్ట్రీలో అందరూ ధైర్యవంతులే..పిచ్చి పిచ్చిగా మాట్లాడొద్దు

ఎవరిని మెప్పించాలని ప్రజాప్రతినిధులు మాట్లాడుతున్నారు ? గతంలో ఎవరో ఏదో మాట్లాడారని మీరు అలానే మాట్లాడుతారా ? మీ ఎమ్మెల్యేలు ఎంత తింటున్నారో చర్చిద్దామా అంటూ సవాల్ విసిరారు.

  • Published On : January 12, 2022 / 03:37 PM IST

Tammareddy

Movie Tickets Issue : ఏపీలో టికెట్ల రగడ స్టిల్ కంటిన్యూ అవుతోంది. సినీ పరిశ్రమపై వైసీపీ నేతలు చేస్తున్న కామెంట్స్ రచ్చరచ్చ చేస్తున్నారు. అటు వైసీపీ నేతలు..ఇటు సినీ పరిశ్రమలోని కొంతమంది చేస్తున్న వ్యాఖ్యలు హీట్ పుట్టిస్తున్నాయి. ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన కామెంట్స్ పై దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పిచ్చిపిచ్చిగా మాట్లాడితే మర్యాద ఉండదంటూ ఫైర్ అయ్యారు. సినిమా ఇండస్ట్రీ వారికి సిగ్గు లేదు..దమ్ము లేదంటున్నారని, ఇక్కడున్న అందరూ ధైర్యవంతులేనంటు కామెంట్ చేశారు. సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని అనుకుంటున్నామని, ఎవరిని మెప్పించాలని ప్రజాప్రతినిధులు మాట్లాడుతున్నారు ? గతంలో ఎవరో ఏదో మాట్లాడారని మీరు అలానే మాట్లాడుతారా ? మీ ఎమ్మెల్యేలు ఎంత తింటున్నారో చర్చిద్దామా అంటూ సవాల్ విసిరారు. 2022, జనవరి 12వ తేదీ బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు.

Read More : Sri Lanka :కిలో పచ్చిమిర్చి రూ.710, కిలో ఆలూ రూ. 200

టికెట్ రేట్లు పెంచే అవకాశం తెలంగాణ ప్రభుత్వానికి ఉన్నప్పుడు టికెట్ రేట్లు తగ్గించే అవకాశం ఏపీ ప్రభుత్వానికి ఉంటుందన్నారు. ప్రొడక్ట్ కు ధర నిర్ణయించుకునే అవకాశం నిర్మాతలకూ ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. సినిమా విడుదల వాయిదా పడటానికి ఏపీ టికెట్ రేట్లు ప్రధాన కారణం కాదు .. కరోనా వల్ల పాన్ ఇండియా సినిమాలు వాయిదా పడ్డాయన్నారు. సినిమాలో దమ్ము ఉంటే ఆక్సుపెన్సీ పెద్ద ప్రాబ్లం కాదు …ఇందుకు పుష్ప సినిమానే ఉదాహరణగా చెప్పారు. మీడియాలో ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడటం వల్ల ఇబ్బందులు వస్తున్నట్లు, ఎవరు ఎవరికి భయపడటం లేదన్నారు.

Read More : Bill Gates: ఓమిక్రాన్ రోగనిరోధక శక్తిని పెంచుతుందన్న బిల్ గేట్స్

సినిమా వారికి బలిసిందని కామెంట్స్ చేయడం సబబు కాదన్నారు. నిర్మాతల్లో మీ సామాజికవర్గం వారే టాప్ సినిమాకు మాత్రమే కులం లేదు ..‌కావాలని ఆపాదిస్తున్నారన్నారు. ఎవరిని మెప్పించాలని, ఎవరిని ఇన్సల్ట్ చేయాలని అనుకుంటున్నారో..! గత ప్రభుత్వంలో‌ఎవరో ఎదో మాట్లాడారని, మీరూ అలానే గడ్డి తింటున్నారా అంటూ విరుచుకపడ్డారు. మీ ఎమ్మెల్యేలు ఎంత తింటున్నారో చర్చిద్దామా అంటూ తమ్మారెడ్డి భరద్వాజ సవాల్ విసిరారు. తమ్మారెడ్డి చేసిన వ్యాఖ్యలపై వైసీపీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.