×
Ad

‘వాళ్లు వచ్చాకే ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్.. మహిళలను అనుభవించడానికే సినిమాలు చేస్తున్నారు’

సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ పై తమ్మారెడ్డి భరద్వాజ(Tammareddy Bharadwaj) షాకింగ్ కామెంట్స్.

Tammareddy Bharadwaj shocking comments about casting couch.

  • సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ లేదని చెప్పలేం
  • కొంతమంది అమ్మాయిలను అనుభవించడం కోసమే సినిమాలు చేస్తున్నారు
  • తమ్మారెడ్డి భరద్వాజ షాకింగ్ కామెంట్స్

Tammareddy Bharadwaj: మెగాస్టార్ చిరంజీవి ఇటీవల కాస్టింగ్ కౌచ్ పై కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. మన శంకర వరప్రసాద్ గారు సక్సెస్ ఈవెంట్ లో మాట్లాడుతూ సినిమా ఇండస్ట్రీ అనేది అద్దం లాంటిది అని అన్నారు. అలాగే మనం ఏం ఇస్తే అదే మనకు తిరిగి వస్తుంది, ఇక్కడ కాస్టింగ్ కౌచ్ లేదు, మనం కమిట్మెంట్ తో ఉండాలి అంటూ చెప్పుకొచ్చాడు. ఈ వ్యాఖ్యలు సినీ ఇండస్ట్రీలో వైరల్ అయ్యాయి. సింగర్ చిన్మయి కూడా మెగాస్టార్ చేసిన కామెంట్స్ కి రిప్లై ఇచ్చింది.

తాజాగా టాలీవుడ్ సీనియర్ దర్శకుడు, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ(Tammareddy Bharadwaj) చిరంజీవి చేసిన కామెంట్స్ కి కౌంటర్ ఇచ్చాడు. ఈ విషయం గురించి ఆయన మాట్లాడుతూ.. “సినిమా ఇండ‌స్ట్రీలో కాస్టింగ్ కౌచ్ లేద‌ని చెప్పలేం. మ‌హిళ‌లల‌పై వేధింపులు ఎప్పుడూ ఉన్నాయి. సినిమా రంగం మొద‌ట్లో బాగానే ఉండేది. కానీ, తరువాత ఈ రంగంలోకి జ‌మీందారులు, రాజులు ప్రవేశించారు. వాళ్ళు మ‌హిళ‌ల‌ను అనుభించ‌డం కోస‌మే మాత్రమే సినిమాలు చేసేవారు.

Parasakthi OTT: ఓటీటీలో కొత్త సినిమా ‘పరాశక్తి’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

కానీ, రాను రాను ప‌రిస్థితులు మారాయి. మా రోజుల్లో ప‌రిస్థితులు చాలా మెరుగ్గా ఉండేవి. అయినప్పటికీ 5 నుంచి10 శాతం మంది మ‌హిళ‌ల‌కు వేధింపులకు గురయ్యారు. ప్ర‌స్తుతం ఏడాదికి 200 సినిమాలు వస్తున్నాయి. అందులో కొంద‌రు ఎందుకు సినిమాలు చేస్తున్నారో తెలియడం లేదు. వాళ్లంతా కేవలం అమ్మాయిలను అనుభవించ‌డానికే సినిమాలు చేస్తున్నారు. అది వేరే వ్యవాహారం.

సీరియ‌స్‌గా సినిమాలు చేసే ద‌ర్శ‌కులు, నిర్మాతలు, నటులు ఇలాంటివారికి దూరంగానే ఉంటున్నారు. కేవలం సినిమా ఇండస్ట్రీలోనే కాదు కాస్టింగ్ కౌచ్ అనేది ప్రతీ రంగంలోనూ ఉంది. మన దగ్గర విషయం ఉంటే మనల్ని ఎవ్వరూ తొక్కలేరు” అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో తమ్మారెడ్డి భరద్వాజ్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతున్నాయి.