Sudev Nair: టాలీవుడ్ ఇండస్ట్రీకి కొత్త విలన్.. వరుస బ్లాక్ బస్టర్స్ కొట్టేస్తున్నాడు
టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస ఆఫర్స్ దక్కించుకుంటున్న కన్నడ నటుడు సుదేవ్ నాయర్(Sudev Nair).
Actor Sudev Nair getting crazy offers in Tollywood.
- టాలీవుడ్ లో కొత్త విలన్
- వరుస బ్లాక్ బస్టర్స్ అందుకుంటున్న కన్నడ నటుడు
- యష్ టాక్సిక్ లో అవకాశం దక్కించుకున్న సుదేవ్ నాయర్
Sudev Nair: టాలీవుడ్ ఇండస్ట్రీకి కొత్త విలన్ దొరికేశాడా అంటే అవునని బలంగా చెప్పేయొచ్చు. మరి అతని దూకుడు చూస్తే అదే రేంజ్ లో ఉంది. వరుసగా బ్లాక్ బస్టర్స్ అందుకుంటున్నాడు. విలనిజంలో కొత్త వేరియేషన్స్ చూపిస్తూ ఆడియన్స్ ను మెప్పిస్తున్నాడు. ఆ నటుడు మరెవరో కాదు సుదేవ్ నాయర్(Sudev Nair). ఈ కన్నడ నటుడి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. రవితేజ హీరోగా వచ్చిన టైగర్ నాగేశ్వర రావు సినిమాలో కనిపించి మెప్పించాడు. ఆ తరువాత నితిన్ తో ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ అనే సినిమాలో కూడా నటించాడు.
కానీ, అతనికి మొదటి బ్రేక్ అంటే పవన్ కళ్యాణ్ తో చేసిన ఓజీ అనే చెప్పాలి. ఈ సినిమాలో విలన్ కొడుకుగా చాలా స్టయిలీష్ గా కనిపించి అదరగొట్టేశాడు సుదేవ్ నాయర్. ఇక రీసెంట్ గా వచ్చిన మరో బ్లాక్ బస్టర్ మూవీ మన శంకర వరప్రసాద్ గారు సినిమాలో కూడా మెగాస్టార్ చిరంజీవికి విలన్ గా నటించాడు సుదేవ్ నాయర్. ఈ సినిమాలో కూడా రెగ్యులర్ విలన్స్ లా కాకుండా చాలా సెటిల్డ్ గా నటించి మంచి ప్రశంసలు అందుకున్నాడు. ఇక ఈ సినిమా ఏకంగా ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది.
Dhurandhar OTT: ఓటీటీలో దురంధర్.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్స్
ఇలా వరుసగా హిట్స్ అందుకుంటూ స్టార్ హీరోలకి లక్కీ విలన్ గా మారిపోయాడు సుదేవ్ నాయర్. అంతేకాదు, మన శంకర వరప్రసాద్ గారు సినిమా విజయం తరువాత టాలీవుడ్ నుంచి మంచి ఆఫర్స్ అందుకుంటున్నాడట ఈ నటుడు. ఇక సుదేవ్ కేవలం నటుడు మాత్రమే కాదు క్రీడాకారుడు కూడా. ఆయనకి మార్షల్ ఆర్ట్స్‌లో ప్రావీణ్యం ఉందట. అది ఆయన చేసే యాక్షన్ సీక్వెన్స్‌లలో మనం స్పష్టంగా చూడొచ్చు.
అథ్లెటిక్ బాడీ కావడంతో దృడమైన శరీరంతో విలన్ పాత్రలకు సరికొత్త టచ్ ఇస్తున్నాడు ఈ కన్నడ నటుడు. దీంతో, అన్ని భాషల్లో మనోడికి ఫుల్ డిమాండ్ ఏర్పడుతోంది. ఇక కన్నడ స్టార్ యష్ హీరోగా వస్తున్న కొత్త చిత్రం టాక్సిక్ లో కూడా సుదేవ్ నాయర్ విలన్ గా నటిస్తున్నాడు. భారీ అంచనాల మధ్య వస్తున్న ఈ సినిమా త్వరలోనే థియేటర్స్ లోకి రానుంది. ఈ సినిమా కూడా హిట్ అయ్యింది అంటే సుదేవ్ నాయర్ టాప్ పొజిషన్ లోకి వెళ్లడం ఖాయం.
