PM Modi – Tanikella Bharani : మోదీని కలిసిన తనికెళ్ళ భరణి.. నేను రాముణ్ణి, కృష్ణుణ్ణి చూడలేదు అంటూ ఎమోషనల్ పోస్ట్..

బేగంపేట విమానాశ్రయంలో మోదీని ప్రముఖ నటుడు, రచయిత తనికెళ్ళ భరణి కలిశారు. (Tanikella Bharani)

  • Updated on- May 11, 2026 / 02:49 PM IST

Tanikella Bharani Meets Pm Narendra Modi Emotional Post

PM Modi – Tanikella Bharani: ప్రధానమంత్రి మోదీ ఆదివారం నాడు హైదరాబాద్ వచ్చిన సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ క్రమంలో పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖులను మోదీ కలిశారు. తిరుగు ప్రయాణంలో బేగంపేట విమానాశ్రయంలో మోదీని ప్రముఖ నటుడు, రచయిత తనికెళ్ళ భరణి కలిశారు.

Also Read : Anna Lezhneva : పీఎం మోదీకి ప్రామిస్ చేశా.. పవన్ కళ్యాణ్ భార్య స్పెషల్ పోస్ట్..

తనికెళ్ళ భరణి మోదీకి నమస్కారం చేయగా ఆయన భరణి చేతులు పట్టుకొని దగ్గరికి తీసుకొని మాట్లాడారు. మోదీతో దిగిన ఫోటోని తనికెళ్ళ భరణి తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. నేను రాముణ్ణి చూడలేదు, కృష్ణుణ్ణి చూడలేదు, ఆదిశంకరుల్ని చూడలేదు, వివేకానందుణ్ణి చూడలేదు. చూడలేము కూడా. కానీ వాళ్లందరి అంశలతో ఉన్న మోడీ గారిని చూశాను, ముట్టుకున్నాను, చేతిని ముద్దెట్టుకున్నాను. నా జన్మ ధన్యం అంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు. దీంతో ఈ పోస్ట్ వైరల్ గా మారింది.