Taraka Ratna Health : చికిత్స పొందుతున్న తారకరత్న ఫోటో లీక్..
నందమూరి హీరో తారకరత్న ఇటీవల గుండెపోటు కారణంగా హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యాడు. గత మూడు రోజుల నుంచి వెంటిలేటర్ పై ట్రీట్‌మెంట్ అందిస్తూ వస్తున్నారు వైద్యులు. నిన్న తాజా హెల్త్ బులిటెన్ ను కూడా రిలీజ్ చేశారు వైద్యులు. ఇక ఐసియూలో ఉన్న తారకరత్నని చూసేందుకు కుటుంబసభ్యులను కూడా వైద్యులు నిరాకరిస్తున్న సమయంలో తారకరత్నకి సంబంధించిన ఫోటో ఒకటి బయటకి వచ్చింది.
- gum 95921
- Published On : January 31, 2023 / 11:20 AM IST
Taraka Ratna Health
Taraka Ratna Health : నందమూరి హీరో తారకరత్న ఇటీవల గుండెపోటు కారణంగా హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యాడు. ఆంధ్రప్రదేశ్ టీడీపీ నాయకుడు నారా లోకేష్ ప్రారంభించిన యువగళం పాదయాత్రలో పాల్గొడానికి వచ్చిన తారకరత్న సడన్ గా స్పృహ తప్పి పడిపోయాడు. వెంటనే కుప్పం హాస్పిటల్ కి తరలించగా హార్ట్ ఎటాక్ అని తెలిసింది. ఫస్ట్ ఎయిడ్ ట్రీట్‌మెంట్ అందించి వైద్యులు, మెరుగైన చికత్స కోసం బెంగళూరులోని నారాయణ హృదయాలయానికి తరలించారు. అయితే అప్పటికే పరిస్థితి విషమించడంతో గత మూడు రోజుల నుంచి వెంటిలేటర్ పై ట్రీట్‌మెంట్ అందిస్తూ వస్తున్నారు వైద్యులు.
Chiranjeevi Tweet on Tarakarathna : తారకరత్న ఆరోగ్యంపై మెగాస్టార్ ట్వీట్..
నిన్న తాజా హెల్త్ బులిటెన్ ను కూడా రిలీజ్ చేశారు వైద్యులు. ఈ హెల్త్ అప్డేట్ లో తారకరత్న పరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నట్లు వెల్లడించారు. తారకరత్నకి ఎలాంటి ఎక్మో సపోర్ట్ ఇవ్వడం లేదని, వెంటిలేటర్‌పైనే చికిత్స అందిస్తున్నట్లుగా బులిటెన్ లో వైద్యులు పేర్కొన్నారు. ఇక ఐసియూలో ఉన్న తారకరత్నని చూసేందుకు కుటుంబసభ్యులను కూడా వైద్యులు నిరాకరిస్తున్న సమయంలో తారకరత్నకి సంబంధించిన ఫోటో ఒకటి బయటకి వచ్చింది. ఈ ఫొటోలో తారకరత్న వెంటిలేటర్ పై చికిత్స పొందుతూ కనిపిస్తున్నాడు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది.
ఆ ఫొటోలో వెంటిలేటర్ పై అపస్మారక స్థితిలో ఉన్న తారకరత్నని చూసిన అభిమానులు.. తారకరత్న త్వరగా కోలుకోవాలంటూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇటీవలే తారకరత్నని చూసేందుకు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ బెంగళూరు వెళ్లారు. అక్కడ డాక్టర్లతో మాట్లాడి తారకరత్న పరిస్థితి తెలుసుకున్నారు. బాలకృష్ణ అయితే అక్కడే ఉంటూ తారకరత్న ఆరోగ్య పరిస్థితి తెలుసుకుంటూ కుటుంబ సబ్యులకు ధైర్యం చెబుతున్నాడు. కాగా తారకరత్న కోలుకొని తిరిగి రావాలంటూ సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదిక తెలియజేస్తున్నారు. తాజాగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కూడా తారకరత్న పై ట్వీట్ చేశాడు.
