Taraka Ratna : తారకరత్న ఆరోగ్యం అత్యంత విషమం.. బెంగళూరుకు చేరుకుంటున్న కుటుంబసభ్యులు..
నందమూరి హీరో తారకరత్న ఇటీవల గుండెపోటు కారణంతో హాస్పిటల్ లో అడ్మిట్ అయిన సంగతి తెలిసిందే. 22 రోజులుగా చికిత్స అందిస్తూ, వైద్యులు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా తారకరత్న ఆరోగ్యంలో మాత్రం పురోగతి కనిపించడం లేదు. అయితే నేడు ఎంఆర్ఐ స్కాన్ నిర్వహించగా తారకరత్న ఆరోగ్యం మరింత క్షీణించినట్లు సమాచారం. దీంతో బాలకృష్ణ హుటాహుటిన...
- gum 95921
- Published On : February 18, 2023 / 04:27 PM IST
Taraka Ratna
Taraka Ratna : నందమూరి హీరో తారకరత్న ఇటీవల గుండెపోటు కారణంతో హాస్పిటల్ లో అడ్మిట్ అయిన సంగతి తెలిసిందే. గత నెల 27న టీడీపీ లీడర్ నారా లోకేష్ మొదలు పెట్టిన పాదయాత్రలో పాల్గొనేందుకు వెళ్లిన తారకరత్న.. ఆ పాదయాత్రలో నడుస్తూ నడుస్తూ కుప్పకూలి పోయారు. అక్కడ ఉన్న పార్టీ కార్యకర్తలు వెంటనే తారకరత్నని కుప్పం హాస్పిటల్ కి తరలించారు. ఆ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అందించిన అనంతరం తారకరత్నని బెంగుళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలించారు.
Taraka Ratna Health : విషమంగానే తారకరత్న ఆరోగ్యం, బ్రెయిన్ రికవరీపైనే డాక్టర్ల ఫోకస్
బ్రెయిన్ స్పందించకపోవడంతో అప్పటి నుంచి తారకరత్న కోమాలోనే ఉన్నారు. 22 రోజులుగా చికిత్స అందిస్తూ, వైద్యులు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా తారకరత్న ఆరోగ్యంలో మాత్రం పురోగతి కనిపించడం లేదు. గత వారం రోజులు నుంచి తారకరత్నకు విదేశీ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తూ వస్తున్నారు. అయితే నేడు ఎంఆర్ఐ స్కాన్ నిర్వహించగా తారకరత్న ఆరోగ్యం మరింత క్షీణించినట్లు సమాచారం. ప్రస్తుతం అత్యవసర చికిత్స అందిస్తున్నారని తెలుస్తుంది.
Taraka Ratna: తారకరత్న హెల్త్ అప్డేట్.. ఫారిన్ డాక్టర్లతో స్పెషల్ ట్రీట్మెంట్
తారకరత్న ఆరోగ్యం అత్యంత విషమంగా ఉందని తెలుసుకున్న బాలకృష్ణ హుటాహుటిన బెంగళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రికి చేరుకున్నాడు. ఇతర కుటుంబ సభ్యులు కూడా హాస్పిటల్ కి చేరుకుంటున్నారు. ఒకరి తరువాత ఒకరు కుటుంబ సభ్యులు అంతా ఆసుపత్రికి చేరుకుంటుంటే అభిమానుల్లో ఆందోళన మొదలైంది. తారకరత్న కోలుకొని తిరిగి రావాలి అంటూ అభిమానులంతా ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈరోజు సాయంత్రం వైద్య బృందం నుంచి హెల్త్ బులిటెన్ వచ్చే అవకాశం ఉంది.
