Taraka Ratna Health : విషమంగానే తారకరత్న ఆరోగ్యం, బ్రెయిన్ రికవరీపైనే డాక్టర్ల ఫోకస్

బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. ఇవాళ తారకరత్నకు స్కానింగ్ లతో పాటు మరికొన్ని వైద్య పరీక్షలు నిర్వహించారు. నిమ్హాన్స్ వైద్యుల సహకారం కొనసాగుతోంది.

Taraka Ratna Health : విషమంగానే తారకరత్న ఆరోగ్యం, బ్రెయిన్ రికవరీపైనే డాక్టర్ల ఫోకస్

Taraka Ratna Health

Taraka Ratna Health : బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. ఇవాళ తారకరత్నకు స్కానింగ్ లతో పాటు మరికొన్ని వైద్య పరీక్షలు నిర్వహించారు. నిమ్హాన్స్ వైద్యుల సహకారం కొనసాగుతోంది. ముఖ్యంగా వైద్యులు తారకరత్న బ్రెయిన్ రికవరీపైనే దృష్టి పెట్టారు. విదేశీ డాక్టర్ల సహకారం తీసుకుంటున్నట్లు సమాచారం. ఇవాళ తారకరత్న హెల్త్ బులెటిన్ విడుదలయ్యే అవకాశం ఉంది.

తారకరత్న హెల్త్ కండీషన్ లో పెద్దగా పురోగతి లేదని ఆసుపత్రి వర్గాల నుంచి అందుతున్న సమాచారం. గుండెపోటుకు గురైన మొదటి మూడు నాలుగు రోజులు ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో, ఇప్పుడు కూడా అలాంటి హెల్త్ కండీషనే ఉందని చెబుతున్నారు. తారకరత్న కోలుకునేందుకు డాక్టర్లు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. అన్ని రకాల ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.

Also Read..Taraka Ratna Health : దేవుడిని ప్రార్థిస్తున్నా.. తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

తాజాగా సిటి స్కాన్ తో పాటు మరికొన్ని బ్లడ్ టెస్టులు కూడా చేశారు. రాత్రికల్లా సంబంధిత టెస్టుల రిపోర్టులు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు నిమ్ హాన్స్ వైద్య బృందం కూడా ఎప్పటికప్పుడు తారకరత్నకు తమ వంతు వైద్య సాయం అందిస్తోంది. అలాగే కొంతమంది ఫారిన్ డాక్టర్ల సాయంతో వైద్యం అందిస్తున్నారు. బ్రెయిన్ ఎంతవరకు డెడ్ అయ్యింది? తిరిగి బ్రెయిన్ డెడ్ నుంచి పూర్తిగా రికవరీ చేసేందుకు విదేశీ డాక్టర్ల సాయాన్ని కూడా నారాయణ హృదయాలయ డాక్టర్లు తీసుకుంటున్నట్లు సమాచారం.

Also Read..Taraka Ratna: తారకరత్న హెల్త్ అప్డేట్.. ఫారిన్ డాక్టర్లతో స్పెషల్ ట్రీట్మెంట్

న్యూరో సర్జన్, న్యూరాలజిస్టులు తారకరత్న ఆరోగ్యం విషయంలో తీవ్ర స్థాయిలో పని చేస్తూ ఉన్నారు. మరోవైపు ఇవాళ ఒక హెల్త్ బులెటిన్ వస్తుందని ప్రచారం జరుగుతోంది. హెల్త్ బులెటిన్ వచ్చి దాదాపు 10 రోజులు దాటింది. ఇంతవరకు కూడా అధికారికంగా ఆసుపత్రి నుంచి ఎలాంటి బులెటిన్ లేదు. ఈ నేపథ్యంలో ఇవాళ ఒక హెల్త్ బులెటిన్ వచ్చే చాన్స్ ఉందని సమాచారం. మొత్తంగా తారకరత్న ఆరోగ్యంలో ఎలాంటి పురోగతి లేకపోయినా ఇప్పటికీ అలాంటి స్థితే ఉంది, కొంత మెరుగ్గానే ఉందన్న సమాచారం ఆసుపత్రి వర్గాల నుంచి అందుతోంది.

Also Read..Actor Tarakaratna Ill : నటుడు తారకరత్నకు అస్వస్థత.. మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలింపు

గుండెపోటుకి గురైన సమయంలో బ్రెయిన్ కు రక్త సరఫరా అందని సమయంలో తారకరత్న బ్రెయిన్ లో ఎడిమా(వాపు) ఏర్పడింది. ఆ వాపును కరిగించేందుకు గత పది రోజులుగా డాక్టర్లు ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇందులో భాగంగానే నిమ్ హాన్స్ వైద్యులతో పాటు విదేశాలకు చెందిన న్యూరాలజిస్టులు, న్యూరో సర్జన్ల సహకారం కూడా తీసుకుంటున్నారు. అయితే, ఆ వాపు ఎంతవరకు తగ్గింది? అసలు తగ్గిందా లేదా? అనే దాని గురించి ఇప్పటివరకు అధికారిక సమాచారం లేదు. అయితే, చాలావరకు కొంత పురోగతి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇవాళ మరోసారి ఆయనకు స్కానింగ్ తీసే ప్రయత్నం చేసినట్లుగా తెలుస్తోంది. మొత్తంగా హెల్త్ బులెటిన్ వస్తే బాగుంటుందని ఇటు నందమూరి కుటంబీకులు అటు అభిమానులు కోరుకుంటున్నారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ప్రారంభోత్సవంలో నందమూరి తారకరత్న సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు. తారకరత్నకు తీవ్ర గుండెపోటు వచ్చిందని వైద్యులు నిర్ధారించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కుప్పం నుంచి బెంగళూరుకు తారకరత్నను తరలించారు. బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో కొన్ని రోజులుగా తారకరత్నకు ట్రీట్ మెంట్ జరుగుతోంది.