Actor Tarakaratna Ill : నటుడు తారకరత్నకు అస్వస్థత.. మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలింపు

నటుడు తారకరత్న అస్వస్థతకు గురికావడంతో మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలించారు. రాత్రి పొద్దుపోయాక ప్రత్యేక అంబులెన్స్ లో బెంగళూరుకు కుటుంబ సభ్యులు తరలించారు. నారాయణ హృదయాలయ ఆస్పత్రికి తరలించారు.

Actor Tarakaratna Ill : నటుడు తారకరత్నకు అస్వస్థత.. మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలింపు

Tarakaratna

Actor Tarakaratna ill : నటుడు తారకరత్న అస్వస్థతకు గురికావడంతో మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలించారు. రాత్రి పొద్దుపోయాక ప్రత్యేక అంబులెన్స్ లో బెంగళూరుకు కుటుంబ సభ్యులు తరలించారు. నారాయణ హృదయాలయ ఆస్పత్రికి తరలించారు. బాలకృష్ణ తన వాహనంలో ముందు వెళ్లగా.. అంబులెన్స్ లో తారకరత్నను వెనుక తీసుకెళ్లారు. ఇప్పుడు తారకరత్నకు నారాయణ హృదయాలయ ఆస్పత్రి వైద్య బృందం చికిత్స అందిస్తున్నారు. డాక్టర్లు తారకరత్నను ఐసీయూలో అబ్జర్వేషన్ లో ఉంచారు. వైద్యులు ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు.  బాలకృష్ణ ఎప్పటికప్పుడు తారకరత్న ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటున్నారు.

అంతకముందు కుప్పంలో చికిత్స పొందుతున్న తారకరత్నను ఆయన భార్య అలేఖ్య రెడ్డి, కూతురు నిషిక చూసి కన్నీరు పెట్టుకున్నారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అయితే తారకరత్న హెల్త్ కండీషన్ ను వారికి బాలకృష్ణ వివరించారు. ఆందోళన చెందవద్దని వారిద్దరికీ ధైర్యం చెప్పారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలించారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితిని నందమూరి బాలకృష్ణ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. తారకరత్న గుండెలో ఎడమ వైపు వాల్ 90 శాతం బ్లాక్ అయిందని, మెరుగైన వైద్యం కోసం బెంగళూరు ఆస్పత్రికి తరలించాలని కుప్పంలోని పీఈసీ ఆస్పత్రి వైద్యులు మొదట సూచించారు.

Taraka Ratna: తారకరత్న ఆరోగ్యంపై బాలకృష్ణ క్లారిటీ..!

ఈ మేరకు బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రి చైర్మన్ దేవిశెట్టిని పీఈసీ ఆస్పత్రి వైద్యులు సంప్రదించారు. దీంతో అక్కడి నుంచి అత్యాధునిక సదుపాయాలు ఉన్న ప్రత్యేక అంబులెన్స్ ను కుప్పం రప్పించారు. ఆ అంబులెన్స్ లో ప్రముఖ కార్డియాలజిస్టుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తూ తారకరత్నను బెంగళూరులోని నారాయణ హృదయాల ఆస్పత్రికి తరలించే విధంగా ఏర్పాటు చేశారు. బెంగుళూరు నుంచి అత్యాధునిక వైద్య పరికరాలు తీసుకరావడంతో కుప్పం పీఈసీ ఆస్పత్రిలోనే నారాయణ హృదయాలయ ఆస్పత్రి వైద్యులు చికిత్స కొనసాగించారు.

కుప్పంలో నారా లోకేశ్ పాదయాత్రలో పాల్గొనడానికి వచ్చిన తారకరత్న బిజీ బిజీగా ఉన్నారు. నిన్న బాలకృష్ణతో కలిసి హిందూపురంలో పర్యటించారు. నిన్న కుప్పం చేరుకున్నారు. ఉదయం నుంచి ఏమీ తినకపోవడంతో తారకరత్న నీరసపడ్డారు. దీనికి తోడు పెద్ద సంఖ్యలో కార్యకర్తల మధ్య వెల్లడానికి ఇబ్బంది పడ్డారు. లోకేశ్ పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న నడుస్తూ నడుస్తూ ఒక్కసారిగా స్పృహ తప్పిపడిపోయారు. టీడీపీ నాయకులు వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించారు.

Tarakarama Theatre: బాలయ్య చేతుల మీదుగా వైభవంగా రీ-ఓపెన్ అయిన తారకరామ థియేటర్!

ఆస్పత్రికి వచ్చేటప్పటికే పల్స్ లేకపోవడంతో డాక్టర్లు సీపీఆర్ చేసి పల్స్ వచ్చేటట్లు చేశారు. హార్ట్ కు ఎడమవైపు బ్లాక్స్ బ్లడ్ సప్లై అయి నరం 90 బ్లాక్ కావడంతో గుండె పోటు వచ్చినట్లు వైద్యులు నిర్ధారించారు. తారకరత్నకు ఆంజియోగ్రామ్ చేసిన డాక్టర్లు ఒక స్టెంట్ కూడా అమర్చారు. ఉదయం నుంచి బాలకృష్ణతో ఇతర టీడీపీ నేతలు ఆస్పత్రిలో ఉండి తారకరత్నకు అందుతున్న వైద్యాన్ని పర్యవేక్షించారు. చంద్రబాబు సైతం ఎప్పటికప్పుడు డాక్టర్లు, బాలకృష్ణతో మాట్లాడుతూ హెల్త్ అప్ డేట్ ను అడిగి తెలుసుకున్నారు.