Tarakarama Theatre: బాలయ్య చేతుల మీదుగా వైభవంగా రీ-ఓపెన్ అయిన తారకరామ థియేటర్!

హైదరాబాద్ కాచిగూడలోని ‘తారకరామ’ థియేటర్ ఎట్టకేలకు మళ్లీ తెరుచుకుంది. నందమూరి బాలకృష్ణ ఈ థియేటర్‌ను వైభవంగా పునః ప్రారంభించారు. లెజెండరీ ఫిలిం పర్సనాలిటీ నారాయణ్ కె దాస్ నారంగ్, ఆయన కుమారులు సునీల్ నారంగ్, భరత్ నారంగ్, విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారిపై ఉన్న అభిమానంతో ‘ఏషియన్ తారకరామ’ థియేటర్‌ని రెనోవేట్ చేశారు. కాగా బుధవారం రోజున ‘ఏషియన్ తారకరామ’ థియేటర్ రీ-ఓపెన్ కార్యక్రమంలో నందమూరి బాలకృష్ణ, ప్రొడ్యూసర్ శిరీష్‌లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

Tarakarama Theatre: బాలయ్య చేతుల మీదుగా వైభవంగా రీ-ఓపెన్ అయిన తారకరామ థియేటర్!

Balakrishna Re-Opens Tarakarama Theatre In Kachiguda

Tarakarama Theatre: హైదరాబాద్ కాచిగూడలోని ‘తారకరామ’ థియేటర్ ఎట్టకేలకు మళ్లీ తెరుచుకుంది. నందమూరి బాలకృష్ణ ఈ థియేటర్‌ను వైభవంగా పునః ప్రారంభించారు. లెజెండరీ ఫిలిం పర్సనాలిటీ నారాయణ్ కె దాస్ నారంగ్, ఆయన కుమారులు సునీల్ నారంగ్, భరత్ నారంగ్, విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారిపై ఉన్న అభిమానంతో ‘ఏషియన్ తారకరామ’ థియేటర్‌ని రెనోవేట్ చేశారు. కాగా బుధవారం రోజున ‘ఏషియన్ తారకరామ’ థియేటర్ రీ-ఓపెన్ కార్యక్రమంలో నందమూరి బాలకృష్ణ, ప్రొడ్యూసర్ శిరీష్‌లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. తనకు జన్మనిచ్చి, ప్రేక్షకుల గుండెల్లో తనకు చిరస్థాయిని కల్పించిన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, తన కన్నతండ్రి, తన గురువు, దైవం, ఆ కారణజన్ముడికి ఈ శతజయంతి సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నానని అన్నారు. తారకరామ థియేటర్‌కి ఎంతో గొప్ప చరిత్ర ఉందని.. తన తండ్రిగారు ఏది చేసినా అది చరిత్రలో నిలిచిపోయేటట్లు చేస్తారని.. అది ఆయన దూరద్రుష్టి అని బాలయ్య అన్నారు.

కాచిగూడలో ఏషియన్ తారకరామ థియేటర్ రీలాంచ్

‘‘నటనకు జీవం పోసిన నటధీశాలుడు నందమూరి తారకరామారావు గారు. తెలుగువారి స్ఫూర్తి ప్రదాత తారకరామారావు గారు. చిత్ర పరిశ్రమ మద్రాస్‌లో ఉన్నప్పుడు ఇక్కడ ఎన్టీఆర్ ఎస్టేట్ ప్రారంభించి ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో ప్రస్థానం మొదలుపెట్టారు. ఇక్కడ ఎన్టీఆర్ ఎస్టేట్ కూడా ఒక పర్యాటక స్థలంగా ఉండేది. అలాగే ఈ తారకరామ థియేటర్ ఉండేది. తారకరామ థియేటర్ అమ్మనాన్నగారి పేర్లు కలిసి వచ్చేటట్లు కట్టిన దేవాలయం. 1978లో ‘అక్బర్ సలీం అనర్కాలి’తో ఈ థియేటర్‌ని ప్రారంభించడం జరిగింది. తర్వాత 95లో కొన్ని అనివార్యకారణాల వలన మళ్ళీ ప్రారంభించడం జరిగింది. ఇక ఇప్పుడు ఇది మూడోసారి. డాన్ సినిమా ఇక్కడ 525 రోజులు ఆడింది. అలాగే నా సినిమాలు ‘మంగమ్మగారి మనవడు’, ‘ముద్దుల మావయ్య’, ‘ముద్దుల కృష్ణయ్య’, ‘అనసూయమ్మగారి అల్లుడు’.. ఇలా అన్నీ సినిమాలు అద్భుతంగా ఆడాయి.’’ అని అన్నారు.

Asian Tarakarama Theater : సీనియర్ ఎన్టీఆర్ థియేటర్.. త్వరలో రీ ఓపెనింగ్.. ఎక్కడో తెలుసా??

నారాయణ్ కె దాస్ నారంగ్‌కి నాన్నగారితో సన్నిహిత సంబంధాలు ఉండేవి. వాళ్ళ అబ్బాయి సునీల్ నారంగ్ ఆ పరంపరని ముందుకు తీసుకువెళ్తున్నారు. మేమంతా ఒక కుటుంబ సభ్యులం. వారి పర్యవేక్షణలో ఈ థియేటర్ నడపడం చాలా సంతోషంగా ఉందని బాలయ్య ఈ సందర్భంగా తెలిపారు. మంచి సినిమాలు తీయడం మన తెలుగు చిత్ర పరిశ్రమ ప్రత్యేకత. పాన్ ఇండియా స్థాయికి మన తెలుగు చిత్ర పరిశ్రమ ఎదిగింది. మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్లు చలనచిత్ర పరిశ్రమ వర్ధిల్లి ముందుకు సాగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని బాలయ్య అన్నారు.