Taraka Ratna: తారకరత్న ఆరోగ్యంపై బాలకృష్ణ క్లారిటీ..!
టాలీవుడ్ నటుడు నందమూరి తారకరత్న తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఒక్కసారిగా అభిమానులు, నందమూరి కుటుంబ సభ్యులు, టీడీపీ శ్రేణులు ఉలిక్కిపడ్డాయి. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ‘యువగళం’ పేరుతో కుప్పం నుంచి చేపట్టిన ప్రతిష్టాత్మక పాదయాత్రలో పాల్గొన్న నందమూరి తారకరత్న.. సొమ్మసిల్లి పడిపోయారు.

Balakrishna Gives Clarity On Taraka Ratna Health Condition
Taraka Ratna: టాలీవుడ్ నటుడు నందమూరి తారకరత్న తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఒక్కసారిగా అభిమానులు, నందమూరి కుటుంబ సభ్యులు, టీడీపీ శ్రేణులు ఉలిక్కిపడ్డాయి. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ‘యువగళం’ పేరుతో కుప్పం నుంచి చేపట్టిన ప్రతిష్టాత్మక పాదయాత్రలో పాల్గొన్న నందమూరి తారకరత్న.. సొమ్మసిల్లి పడిపోయారు. దీంతో ఆయన్ను హుటాహుటిన కుప్పంలోని ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స అందిస్తున్నారు.
TarakaRathna : నటుడు తారకరత్నకు అస్వస్థత.. కుప్పం ఆసుపత్రిలో చికిత్స..
ఈ విషయం తెలుసుకున్న నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కుప్పం ఆసుపత్రికి చేరుకుని తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను అడిగి ఆరా తీశారు. వైద్యులు ఆయనకు చెప్పిన విషయాలను బాలకృష్ణ మీడియాతో పంచుకున్నాడు. తారకరత్నకు తీవ్ర గుండెపోటు వచ్చిందని.. ఆయనకు వైద్యులు యాంజియోగ్రామ్ నిర్వహించారని.. ప్రస్తుతం ఆయన పరిస్థితి బాగానే ఉందని.. మిగతా రిపోర్టులన్నీ కూడా బాగానే ఉన్నాయని బాలయ్య తెలిపారు. స్థానిక వైద్యులు తారకరత్నకు కావాల్సిన ప్రాథమిక వైద్యాన్ని అందించారని.. వారి సూచన మేరకు మెరుగైన చికిత్స నిమిత్తం బెంగుళూరుకు తరలించనున్నట్లు బాలకృష్ణ తెలిపారు.
Tarakarathna : అసలు నేను ఎన్టీఆర్‌కి పోటీనే కాదు.. నందమూరి వంశం ఎన్టీఆర్ వల్లే నిలబడుతుంది..
ఈ క్రమంలో తారకరత్న ఆరోగ్యం గురించి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, తారకరత్న భార్య ఫోన్ చేసి అడిగి తెలుసుకున్నారని.. అభిమానుల ఆశీస్సులు అతడిని శ్రీరామరక్షలా కాపాడతాయని బాలకృష్ణ ఈ సందర్భంగా తెలిపారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బాలయ్య ప్రకటించడంతో అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు.