TarakaRathna : నటుడు తారకరత్నకు అస్వస్థత.. కుప్పం ఆసుపత్రిలో చికిత్స..
నటుడు తారకరత్న ప్రస్తుతం కుప్పంలో ఆసుపత్రిలో ICU లో చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. చికిత్స అందిస్తున్నారు. డీహైడ్రేషన్ కి గురయ్యి, తోపులాట వల్ల...........

Tarakaratna joined kuppam hospital with sudden health issue
TarakaRathna : ఒకప్పుడు హీరోగా మంచి సినిమాలు చేసి ఆ తర్వాత సినిమాలకి కొంచెం గ్యాప్ ఇచ్చినా మళ్ళీ విలన్ గా, నటుడిగా కొన్ని సినిమాలు చేసిన నటుడు తారకరత్న ప్రస్తుతం అడపాదడపా సినిమాలు చేస్తున్నాడు. తాజాగా గత కొన్ని రోజులుగా టీడీపీ పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నాడు. ఈ సారి ఎలాగైనా టీడీపీని అధికారంలోకి తీసుకురావాలంటూ ప్రచారం చేస్తున్నారు.
తాజాగా కుప్పంలో నారా లోకేశ్ యువగళం పేరుతో పాదయాత్ర ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ పాదయాత్రలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అయితే ఈ పాదయాత్రలో నటుడు తారకరత్న కూడా పాల్గొన్నాడు. నారా లోకేశ్ తో కలిసి నడుస్తుండగా హఠాత్తుగా కళ్ళు తిరిగి పడిపోయాడు తారక రత్న. దీంతో కార్యకర్తలు హుటాహుటిన కుప్పంలోని ఓ హాస్పిటల్ కి తరలించారు.
నటుడు తారకరత్న ప్రస్తుతం కుప్పంలో ఆసుపత్రిలో ICU లో చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. చికిత్స అందిస్తున్నారు. డీహైడ్రేషన్ కి గురయ్యి, తోపులాట వల్ల కళ్ళు తిరిగి పడిపోయారు. నాలుగు రోజులుగా విశ్రాంతి లేకుండా నారా లోకేశ్ తో కలిసి పర్యటనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కళ్ళుతిరిగి పడిపోయారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం మెరుగుపడుతుంది. తారక్ కు ఎలాంటి ప్రాణాపాయం లేదు అని టీడీపీ నేతలు తెలిపారు.
Nara Lokesh padayatra : నారా లోకేశ్ ‘యువగళం’ పాదయాత్ర ప్రారంభం.. భారీగా తరలివచ్చిన టీడీపీ శ్రేణులు
అయితే టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి మీడియాతో మాట్లాడుతూ.. తారకరత్నకి గుండెపోటు వచ్చింది. వైద్యులు యాంజియోగ్రామ్ నిర్వహించారు. ప్రస్తుతం ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. వైద్యులు ఎప్పటికప్పుడు ఆయనని పర్యవేక్షిస్తున్నారు. త్వరలోనే తారక్ కోలుకుంటాడు అని తెలిపారు. దీంతో తారక్ అభిమానులు, టీడీపీ అభిమానులు తారక్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.