×
Ad

Tasty Teja : ఆ పని చేస్తే వాళ్ళ ఆయన్ని వదిలేసి నన్ను పెళ్లి చేసుకుంటా అంది.. ప్రియాంక పై తేజ వ్యాఖ్యలు వైరల్..

తాజాగా టేస్టీ తేజ ఓ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా ప్రియాంక జైన్ పై సంచలన వ్యాఖ్యలు చేసాడు. (Tasty Teja)

Tasty Teja

Tasty Teja : టేస్టీ తేజ, ప్రియాంక జైన్ బిగ్ బాస్ సీజన్ 7లో పాల్గొన్నారు. అప్పట్నుంచి వీళ్లిద్దరు మంచి ఫ్రెండ్స్ అయ్యారు. ప్రియాంక సీరియల్స్, యూట్యూబ్ తో బిజీగా ఉంటే టేస్టీ తేజ తన ఫుడ్ ఇంటర్వ్యూ ఛానల్ తో, సినిమాలతో బిజీగా ఉన్నాడు.(Tasty Teja)

ప్రియాంక శివ కుమార్ అనే నటుడితో లివ్ ఇన్ రిలేషన్ లో ఉంది. పెళ్లి చేసుకోకపోయినా ఇద్దరూ భార్యాభర్తల్లాగే ఉంటూ అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. సోషల్ మీడియాలో రెగ్యులర్ గా శివ్ – ప్రియాంక ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తారు. తాజాగా టేస్టీ తేజ ఓ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా ప్రియాంక జైన్ పై సంచలన వ్యాఖ్యలు చేసాడు.

Also See : Kajal Aggarwal : ఫ్యామిలీతో కాజల్ అగర్వాల్ క్రిస్మస్ సెలబ్రేషన్స్.. ఫొటోలు వైరల్..

టేస్టీ తేజ మాట్లాడుతూ.. నువ్వు సిక్స్ ప్యాక్ చెయ్యి మా ఆయన్ను వదిలేస్తా అంది ప్రియాంక జైన్. ఈ విషయం శివ్ ముందే చెప్పింది. వాళ్ళ ఆయన సిక్స్ ప్యాక్ చేసి ఫొటోలు పెట్టాడు. దాని గురించి డిస్కషన్ వచ్చినప్పుడు నేను అక్కడే ఉన్నాను. ఎందుకు అన్ని ఫొటోలు పెడుతున్నావు సిక్స్ ప్యాక్ తో అని శివని అంటూ నాతో తేజ నువ్వు సిక్స్ ప్యాక్ చెయ్ మా ఆయన్ని వదిలేసి వస్తా, నిన్ను పెళ్లి చేసుకుంటా అంది. శివ్ ముందే చెప్పింది ఈ మాట. ఇప్పటికి నాకు ఆ ఓపెన్ ఆఫర్ ఉంది అని అన్నాడు.

దీంతో ఇంటర్వ్యూ లో హోస్ట్ ప్రియాంక కు కాల్ చేయమని అడగ్గా కాల్ చేసి ప్రియాంకని అడిగితే.. అవును తేజ సిక్స్ ప్యాక్ చేస్తే పెళ్లి చేసుకుంటాను అని చెప్పాను. కానీ తేజ సిక్స్ ప్యాక్ చెయ్యలేడు అందుకే చెప్పాను. అది జరిగే పని కాదు అని తెలిపింది. దీంతో టేస్టీ తేజ, ప్రియాంక కామెంట్స్ వైరల్ గా మారాయి. ఇలాంటి ఆఫర్స్ ఏంటో అని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఒకవేళ నిజంగానే తేజ కష్టపడి సిక్స్ ప్యాక్ చేస్తే పరిస్థితి ఏంటి అని ప్రశ్నిస్తున్నారు.

Also Read : Ram Charan : ఎన్టీఆర్ తర్వాత రామ్ చరణ్ తో.. చెర్రీతో జత కట్టనున్న లేటెస్ట్ యూత్ క్రష్..