Ram Charan : ఎన్టీఆర్ తర్వాత రామ్ చరణ్ తో.. చెర్రీతో జత కట్టనున్న లేటెస్ట్ యూత్ క్రష్..
తాజాగా రామ్ చరణ్ నెక్స్ట్ సినిమా గురించి ఆసక్తికర వార్త వినిపిస్తుంది.(Ram Charan)
Ram Charan
Ram Charan : రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా మార్చ్ 2026 లో రిలీజ్ కాబోతుంది. భారీగా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. తాజాగా రామ్ చరణ్ నెక్స్ట్ సినిమా గురించి ఆసక్తికర వార్త వినిపిస్తుంది.(Ram Charan)
పెద్ది తర్వాత రామ్ చరణ్ సుకుమార్ తో సినిమా చేయబోతున్నట్టు గతంలోనే అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే సుకుమార్ స్క్రిప్ట్ పూర్తి చేసి ప్రీ ప్రొడక్షన్ పనులు చూసుకుంటున్నారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా లేటెస్ట్ యూత్ క్రష్, కన్నడ భామ రుక్మిణి వసంత్ పేరు వినిపిస్తుంది.
Also Read : Srikanth – Roshan : ఆ స్టార్ హీరో సినిమా మధ్యలో వదిలేసిన శ్రీకాంత్, రోషన్.. మంచి పని చేశారు..
సప్త సాగరాలు దాటి సినిమాతో ఒక్కసారిగా ఫేమ్ తెచ్చుకున్న రుక్మిణి వసంత్ కాంతారా సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకుంది. తెలుగులో కూడా ఈ అమ్మడికి ఫ్యాన్స్ ఉన్నారు. రుక్మిణి వసంత్ ప్రస్తుతం ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ సినిమా చేస్తుంది. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ సినిమా చేస్తుందని వార్తలు వచ్చాయి.
సమ్మర్ 2026 కి ఈ సినిమా షూట్ మొదలవుతుందని, సుకుమార్ దర్శకత్వంలో చరణ్ పక్కన రుక్మిణి వసంత్ నటిస్తుందని టాలీవుడ్ సమాచారం. ఇదే నిజమైతే బ్యాక్ టు బ్యాక్ ఇద్దరు స్టార్ హీరోలతో పాన్ ఇండియా వైడ్ రుక్మిణి మరింత ఫేమ్ తెచ్చుకోవడం గ్యారెంటీ.
Also See : Murari Working Stills : మహేష్ బాబు ‘మురారి’.. క్లైమాక్స్ షూట్ వర్కింగ్ స్టిల్స్ చూశారా..?
