Technical Glitch in Balakrishna Chopper
Balakrishna : నందమూరి హీరో బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం ‘వీరసింహారెడ్డి’. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న ఆంధ్రప్రదేశ్ ఒంగోలులో జరిగింది. ఈ కార్యక్రమానికి నందమూరి అభిమానులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. వీరసింహారెడ్డి చిత్ర బృందం కూడా ఈ ఫంక్షన్ కి హాజరయ్యి సందడి చేసింది. కాగా నిన్న ఈ ఈవెంట్ దగ్గరకి బాలకృష్ణ హెలికాఫ్టర్ లో చేరుకున్న సంగతి తెలిసిందే.
Veera Simha Reddy : ఆ సినిమా చేయాలని నా జీవిత ఆశయం.. బాలకృష్ణ!
నిన్న రాత్రి అక్కడే బస చేసిన బాలయ్య.. ఈరోజు ఉదయం హైదరాబాద్ కి హెలికాఫ్టర్ లోనే తిరిగి ప్రయాణమయ్యాడు. ఉదయం ఒంగోలు నుంచి బయలుదేరిన హెలికాఫ్టర్ కొంత సమయానికే మరలా ఒంగోలులో ల్యాండ్ అయ్యింది. టేక్ అఫ్ అయిన 20 నిమిషాలకే సాంకేతిక లోపం వల్ల ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది అన్న వార్త విన్న బాలయ్య అభిమానులు ఏమైందో తెలియక కంగారు పడ్డారు.
దీంతో అభిమానుల కంగారు తీర్చడానికి 10టీవీ విలేకరి హెలికాఫ్టర్ పైలట్ తో మాట్లాడి అసలు విషయం తెలుసుకున్నాడు. ఉదయం మంచు కారణంగా మార్గం సరిగ్గా కనిపించడం లేదు అని గుర్తించిన పైలట్.. అప్రమత్తమయ్యి మళ్ళీ ఒంగోలులోనే జాగ్రత్తగా ల్యాండ్ చేశాడు. ప్రస్తుతం బాలయ్య సురక్షితంగానే ఉన్నాడు. ఇంకా మంచుతెర విడకపోవడంతో ఒంగోలులోని బస చేస్తున్నాడు. ఒకవేళ ఈ సమస్య తీరకపోతే బాలయ్య రోడ్డు మార్గంగా హైదరాబాద్ చేరుకోనున్నట్లు తెలుస్తుంది.
కాగా నిన్న ప్రీ రిలీజ్ వీరసింహారెడ్డి ట్రైలర్ ని రిలీజ్ చేసింది చిత్ర బృందం. ఈ ట్రైలర్ లో బాలకృష్ణ ఫ్యాక్షన్ యాక్షన్ తో బాంబులు పిలుస్తూనే, పొలిటికల్ సెటైర్‌లు కూడా పేల్చాడు. జనవరి 12న విడుదలవుతున్న ఈ సినిమాని మలినేని గోపీచంద్ డైరెక్ట్ చేశాడు. శృతిహాసన్, హనీ రోజ్, వరలక్ష్మి శరత్ కుమార్, దునియా విజయ్ ప్రధాన పాత్రలు పోషించారు. థమన్ సంగీతం అందిస్తున్నాడు.