Teja Sajja : తేజ సజ్జ కొత్త సినిమా టైటిల్ గ్లింప్స్ అదిరిందిగా.. అశోకుడి రహస్యంతో ‘మిరాయ్’..

కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తేజ సజ్జ చేయబోయే కొత్త సినిమా టైటిల్ గ్లింప్స్ రిలీజ్ అయ్యింది.

Teja Sajja : ‘హనుమాన్’ వంటి సూపర్ సక్సెస్ తరువాత తేజ సజ్జ.. కార్తీక్ ఘట్టమనేనితో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ దర్శకుడు సూర్య వెర్సస్ సూర్య, ఈగల్ వంటి డిఫరెంట్ మూవీస్ తో తెలుగు ఆడియన్స్ ని బాగా ఆకట్టుకున్నారు. ఇప్పుడు తేజని కూడా కొత్త కథలో చూపించేందుకు సిద్ధమవుతున్నారు. ఇటీవల ఈ మూవీని ప్రీ లుక్ పోస్టర్ తో అనౌన్స్ చేస్తూ ‘ఒక యోధుడి గొప్ప సాహసం’ అంటూ చెప్పుకొచ్చారు.

ఇక ఈ మూవీ టైటిల్ ని గ్లింప్స్ తో అనౌన్స్ చేస్తామంటూ.. ఏప్రిల్ 18 డేట్ ని ఫిక్స్ చేసారు. నేడు ఆ గ్లింప్స్ ని ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చేసారు. కళింగ యుద్ధం తరువాత యోగిగా మారిన అశోకుడు రహస్యంతో ఈ సినిమా కథాంశం మొదలు కాబోతుంది. అశోకుడిని యోగిగా మార్చిన ఓ అపార గ్రంథం కోసం జరిగే పోరాటమే ఈ సినిమా కథ. తొమ్మిది గొప్ప గ్రంథాలతో సిద్ధం చేసిన ఆ అపార గ్రంథాన్ని దక్కించుకోవడం కోసం కొందరు దుండగులు ప్రయత్నిస్తుంటారు.

అయితే ఆ గ్రంథాన్ని కాపాడడం కోసం ఒక యోధుడు ఉంటాడు. ఆ పాత్రనే తేజ సజ్జ చేయబోతున్నారు. ఈ సినిమాకి ‘మిరాయ్’ అనే టైటిల్ ని పెట్టారు. ఇక రిలీజ్ చేసిన గ్లింప్స్ గూస్‌బంప్స్ తెప్పిస్తుంది. ఆ గ్లింప్స్ చూస్తుంటే హనుమాన్ మించిన సక్సెస్ ని తేజ సజ్జ అందుకోబోతున్నట్లు తెలుస్తుంది.

Also read : Mrunal Thakur : జిమ్‌ ట్రైనర్‌ని మోసం చేస్తున్న మృణాల్ ఠాకూర్.. క్యూట్ వర్క్ అవుట్ వీడియో చూశారా..

రితిక నాయక్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు. మంచు మనోజ్ ఈ సినిమాలో విలన్ గా కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 18న రిలీజ్ చేయబోతున్నట్లు డేట్ ని కూడా అనౌన్స్ చేసారు. ఈ సినిమాని ఇండియన్ లాంగ్వేజ్స్ తో పాటు ఇతర దేశాల్లో కూడా రిలీజ్ చేయనున్నారు.

 

ట్రెండింగ్ వార్తలు