Mirai X Review: మిరాయ్ ఎక్స్ రివ్యూ: సూపర్ హీరో తేజ సజ్జ.. సినిమా ఎలా ఉంది.. ఆడియన్స్ రియాక్షన్ ఏంటి?

టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ తేజ సజ్జ హీరోగా వచ్చిన కొత్త సినిమా మిరాయ్(Mirai X Review). దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన ఈ ఫాంటసీ అండ్ అడ్వెంచర్ మూవీలో రితిక నాయక్ హీరోయిన్ గా నటించారు.

Teja Sajja Mirai Movie X Review

Mirai X Review: టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ తేజ సజ్జ హీరోగా వచ్చిన కొత్త సినిమా మిరాయ్. దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన ఈ ఫాంటసీ అండ్ అడ్వెంచర్ మూవీలో రితిక నాయక్ హీరోయిన్ గా నటించారు. భారీ గ్రాఫిక్స్ తో హాలీవుడ్ రేంజ్ విజువల్స్ తో వచ్చిన ఈ సినిమా ట్రైలర్ ఆడియన్స్ లో మంచి అంచనాలు క్రియేట్ చేసింది. దాంతో, ఈ సినిమా విడుదల కోసం ఈగర్ గా వెయిట్ చేశారు. ఫైనల్ గా మిరాయ్ నేడు ప్రేక్షకుల ముందుకురానుంది. అయితే, ఇప్పటికే పలు చోట్ల ప్రీమియర్ షోస్ పడటంతో సినిమా చుసిన ఆడియన్స్ సోషల్ మీడియా వేదికగా సినిమాపై తమ అభిప్రాయాన్ని పంచుకుంటున్నారు(Mirai X Review). మరి వల్ల రియాక్షన్ ఎలా ఉంది అనేది ఇక్కడ తెలుసుకుందాం.

Kishkindhapuri Review : ‘కిష్కింధపురి’ మూవీ రివ్యూ.. బెల్లంకొండ, అనుపమ ఓ రేంజ్ లో భయపెట్టారుగా..

ఆడియన్స్ నుంచి మిరాయ్ సినిమాకు పాజిటీవ్ రెస్పాన్స్ వస్తోంది. సినిమా హాలీవుడ్ రేంజ్ లో ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సినిమాలో గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ అదిరిపోయాయని చెప్తున్నారు. మరికొంతమంది కథ రొటీన్ గానే ఉన్నప్పటికి దానిని ప్రెజెంట్ చేసిన విధానం హైలెట్ అంటున్నారు. డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేనిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఫస్ట్ హాఫ్ ఏక్సలెంట్ గా ఉందని, సెకండ్ హాఫ్ ఎక్స్ట్రాడ్రినరీ గా ఉందని అంటున్నారు. మొత్తంగా హీరోగా తేజ సజ్జ మరో సూపర్ హీరో కాన్సెప్ట్ తో వచ్చిన బ్లాక్ బస్టర్ కొట్టడంటూ కామెంట్స్ చేస్తున్నారు.