Tejaswi Madivada : అమ్మ మరణం.. నాన్న తాగుడుకు అలవాటయి.. తేజస్వి మడివాడ ఎమోషనల్..

తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన గతం గురించి చెప్తూ ఎమోషనల్ అయింది. (Tejaswi Madivada)

  • Updated on- May 30, 2026 / 01:56 PM IST

Tejaswi Madivada

Tejaswi Madivada : సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా గుర్తింపు తెచ్చుకున్న తేజస్వి మడివాడ ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, హీరోయిన్ గా అనేక సినిమాల్లో నటించింది. ఇప్పుడు కూడా పలు సినిమాలు, టీవీ షోలు, వెబ్ సిరీస్ లతో ఫుల్ బిజీగా ఉంది తేజస్వి. బిగ్ బాస్ సీజన్ 2లో కూడా పాల్గొని మరింత ఫేమ్ తెచ్చుకుంది. ఇప్పుడు బాలీవుడ్ షోలలో కూడా పాల్గొంటూ మరింత వైరల్ అవుతుంది.

ఇక సోషల్ మీడియాలో రెగ్యులర్ గా హాట్ హాట్ ఫొటోలు షేర్ చేస్తూ ఉంటుంది తేజస్వి మడివాడ. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన గతం గురించి చెప్తూ ఎమోషనల్ అయింది.

Also Read : Sai Marthand : వాట్.. లిటిల్ హార్ట్స్ డైరెక్టర్ తాతయ్య ఇంత పెద్ద దర్శకుడా? ఎన్టీఆర్, చిరంజీవి, కృష్ణలతో సినిమాలు..

తేజస్వి మడివాడ మాట్లాడుతూ.. మా నాన్న సింగరేణిలో పనిచేసేవాళ్ళు. నాకు నాలుగేళ్లు ఉన్నప్పుడే మా నాన్నకు హైదరాబాద్ కి ట్రాన్స్ఫర్ అవ్వడంతో ఇక్కడికి వచ్చేసాం. నాకు ఏడేళ్ల వయసులో మా అమ్మకు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది. నాకు 11 ఏళ్ళు ఉన్నప్పుడు అమ్మ చనిపోయింది. అప్పటికే అమ్మ క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటుంటే నేను ఇంట్లో పనులన్నీ చేసేదాన్ని. అమ్మ చనిపోయాక 11 ఏళ్లకే లైఫ్ సీరియస్ అయిపొయింది. అప్పట్నుంచే ఇండిపెండెంట్ గా ఉండటం నేర్చుకున్నా.

మా అమ్మ చనిపోయాక నాన్న ముందుకు అలవాటు పడ్డారు. బాగా తాగేవాళ్ళు. అప్పుడు మా నాన్నను చూడాలంటే కూడా భయమేసేది. 13 ఏళ్ళ అప్పుడు 18 ఏళ్ళు రాగానే ఇంట్లోంచి పారిపోవాలని డిసైడ్ అయ్యాను. నాన్న తాగి నేనే ఫుడ్ పెడుతున్న, నేనే చూసుకుంటున్న నిన్ను అని తిట్టేవాళ్ళు. వెయిట్ చేసి 18 ఏళ్ళు రాగానే నేను ఇంట్లోంచి వెళ్ళిపోయాను. నేనే సోలోగా బతుకుతున్నాను అని చెప్తూ ఎమోషనల్ అయింది. ఎప్పుడూ గలగలా మాట్లాడి అందర్నీ నవ్వించే తేజస్వి మనసులో ఇంత బాధ ఉందా అని ఆశ్చర్యపోతున్నారు.

గతంలో కూడా ఓ టీవీ షోలో తన గతం చెప్పి ఇంట్లోంచి బయటకు వచ్చాక ఓ ఫ్రెండ్ ఫ్యామిలీ సపోర్ట్ తో జీవిస్తూ ఇండస్ట్రీలో ఛాన్సుల కోసం ప్రయత్నించిందని తెలిపింది.