Amaram Teaser: తేజేష్ రాజన్ హీరోగా ‘అమరం’.. ఆకట్టుకుంటున్న యాక్షన్ ప్యాకుడ్ టీజర్
తేజేష్ రాజన్ హీరోగా డెబ్యూ ఇస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ 'అమరం(Amaram Teaser)' తెలుగు టీజర్ విడుదల అయ్యింది.
- V Santhosh Kumar
- Updated on- May 6, 2026 / 08:49 PM IST
Tejesh Rajan starer Amaram movie Teaser Released
- తేజేష్ ‘అమరం’ ఇంటెన్స్ యాక్షన్ టీజర్.
- ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్డ్రాప్ కథ.
- మిక్కీ జే మేయర్ మ్యూజిక్.
Amaram Teaser: తేజేష్ రాజన్ హీరోగా డెబ్యూ ఇస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘అమరం(Amaram Teaser)’. తిరుఅరుల్ కృష్ణన్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ విడుదల చేశారు మేకర్స్. ఇంటెన్స్- యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ టీజర్, ఆద్యంతం గూస్‌బంప్స్ తెప్పించే విజువల్స్‌తో సోషల్ మీడియాలో ట్రేండింగ్ గా మారింది. ఈస్ట్రన్ ఘాట్స్ బ్యాక్‌డ్రాప్‌లో ఒక ట్రైబల్ స్మగ్లర్, కిల్లర్, ఒక యువతి చుట్టూ తిరిగే కథాంశంతో ఈ సినిమాను చాలా రా అండ్ రస్టిక్ గా రూపొందించారు.
Niharika Konidela: మెగా డాటర్ నిహారిక కొణిదెల మెరుపులు.. క్రేజీ ఫొటోలు వైరల్
ముఖ్యంగా ఎర్రచందనం స్మగ్లింగ్ వరల్డ్‌లో ఉండే రిస్క్లు, వారి లైఫ్ స్టైల్, అక్కడి సామాజిక సమస్యలను ఈ సినిమాలో చాలా పవర్‌ఫుల్ గా ప్రజెంట్ చేస్తున్నారు. బాంబేకు చెందిన మార్షల్ ఆర్ట్స్ టీమ్ సహకారంతో కంపోజ్ చేసిన యాక్షన్ బ్లాక్స్ ఈ చిత్రానికి మెయిన్ హైలైట్ కానున్నాయి. దాదాపు 200 మంది ఫైటర్లతో కడపలో వేసిన భారీ సెట్స్‌లో చిత్రీకరించిన ఫైట్ సీక్వెన్స్ ప్రేక్షకులకు ఒక సరికొత్త సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇస్తాయని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.
హీరోయిన్‌గా ఐరా అగర్వాల్ నటిస్తుండగా, మిక్కీ జే మేయర్ అందించిన మ్యూజిక్ సినిమాకు బిగ్ అసెట్ కానుంది. ముఖ్యంగా కొడైకెనాల్‌లో 60 మంది కేరళ డ్యాన్సర్లతో షూట్ చేసిన స్పెషల్ ఫోక్ సాంగ్ సినిమాకే హైలైట్‌గా నిలవనుంది. వేర్వేరు నేపథ్యాలున్న ఒక జంట చేసే డేంజరస్ జర్నీగా సాగే ఈ థ్రిల్లర్, త్వరలోనే థియేటర్లలో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. తేజేష్ రాజన్ పెర్ఫార్మెన్స్, డాల్ఫిన్ నోస్ వద్ద చేసిన సింగిల్ టేక్ యాక్షన్ సీన్స్ పై ఇప్పటికే ఇండస్ట్రీలో క్రేజీ చర్చ నడుస్తోంది.
