Sarkaru Bai : సర్కారు బాయి.. మరో తెలంగాణ బ్యాక్ డ్రాప్ సినిమా..

తాజాగా సర్కారు బాయి సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ లాంచ్ ఈవెంట్ నిర్వహించగా.. (Sarkaru Bai)

  • Published on- June 4, 2026 / 09:13 AM IST

Sarkaru Bai

Sarkaru Bai : శ్రీరామ్ నిమ్మల, వర్షిక జంటగా తెరకెక్కుతున్న సినిమా సర్కారు బాయి. తుమ్మల ప్రఫుల్ రాంరెడ్డి నిర్మాణంలో లారా దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. తెలంగాణలో 80 దశకంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా తెలంగాణ సామాజిక నేపథ్యంలో నీటి సమస్యలు, కుల వివక్ష, అణగారిన వర్గాల జీవిత పోరాటాలను ప్రతిబింబించే కథాంశంతో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.

తాజాగా సర్కారు బాయి సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ లాంచ్ ఈవెంట్ నిర్వహించగా దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, డైరెక్టర్ వీఎన్ ఆదిత్య ముఖ్య అతిథులుగా పాల్గొని పోస్టర్‌ను రిలీజ్ చేసారు. ఈ సినిమాలో బాహుబలి ప్రభాకర్, వివ రెడ్డి, నాగ మహేష్, దిల్ రమేష్, చలాకీ చంటి, చిట్టిబాబు, శివాని రెడ్డి, నుపూర్ ముఖర్జీ.. పలువురు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Also Read : Ram Charan : ఇన్నాళ్లు తమిళ్ హీరోలని పొగిడారు.. ఇప్పుడు చరణ్ ని పొగుడుతారా? మన స్టార్ హీరోలకు ఆ దమ్ముందా?

అనంతరం తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ.. నీటి సమస్య కేవలం ఒక ప్రాంతానికే పరిమితం కాదు. ఇప్పటికీ అనేక ప్రాంతాల్లో ప్రజలు నీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి కీలకమైన అంశాన్ని కథాంశంగా తీసుకుని సినిమా రూపొందించడం ఆనందంగా ఉంది అని అన్నారు. వీఎన్ ఆదిత్య మాట్లాడుతూ.. సర్కారు బాయి కథాంశం చాలా ఆసక్తికరంగా ఉంది. ఇలాంటి సబ్జెక్టులతో సినిమాలు నిర్మించే నిర్మాతలు ఉండటం పరిశ్రమకు గొప్ప విషయం అని అన్నారు.

హీరో శ్రీరామ్ నిమ్మల మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ పోరాటం, సామాజిక అంశాలతో కూడిన కథలు నాకు ఇష్టం. అలాంటి కథలో నటిస్తున్నందుకు అదృష్టంగా భావిస్తున్నాను అని అన్నారు. దర్శకుడు లారా మాట్లాడుతూ.. చరిత్రలో మరుగున పడిపోయిన ఓ భావోద్వేగ కథను ఈ సినిమా ద్వారా చూపించబోతున్నాము. 1985లో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనలు, కుల వివక్ష ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాం అని తెలిపారు. నిర్మాత తుమ్మల ప్రఫుల్ రాంరెడ్డి మాట్లాడుతూ.. సమాజానికి సందేశాన్ని అందించే ఈ సినిమా ప్రేక్షకుల హృదయాలను తాకుతుంది. త్వరలోనే షూటింగ్ ప్రారంభిస్తాం అని అన్నారు.