×
Ad

Telangana DGP – Allu Arjun : అల్లు అర్జున్ కి మేం వ్యతిరేకం కాదు.. హీరోలు అత్యుత్సాహం ప్రదర్శిస్తే చర్యలు తీసుకుంటాం..

తాజాగా తెలంగాణ డీజీపీ జితేందర్ నేడు ఈ ఘటనపై కామెంట్స్ చేసారు.

  • Published On : December 22, 2024 / 01:12 PM IST

Telangana DGP Jitender Comments on Allu Arjun Issue

Telangana DGP – Allu Arjun : అల్లు అర్జున్ – సంధ్య థియేటర్ ఘటనకు సంబంధించి నిన్నటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో చర్చ జరుగుతుంది. రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి నా తప్పేమి లేదు, నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు అనడంతో కాంగ్రెస్ నాయకులూ వరుసపెట్టి ఈ ఘటనపై మాట్లాడుతున్నారు.

Also Read : Bandi Sanjay: అల్లు అర్జున్‌ ఇష్యూ.. రేవంత్ స‌ర్కార్‌పై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

తాజాగా తెలంగాణ డీజీపీ జితేందర్ నేడు ఈ ఘటనపై కామెంట్స్ చేసారు. తెలంగాణ డీజీపీ మాట్లాడుతూ.. హీరోలు స్థానిక పరిస్థితులకు అనుకులంగా వ్యవహరించాలి. అత్యుత్సహం ప్రదర్శిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. అల్లు అర్జున్ కి మేం వ్యతిరేకం కాదు. చట్టప్రకారం మేము యాక్షన్ తీసుకున్నాం. ఆ రోజు జరిగిన సంఘటన దురదృష్టకరం అని అన్నారు.