Chiranjeevi : ‘పెద్ది’ ఇష్యూ.. మరోసారి మెగాస్టార్ తో ఎగ్జిబిటర్స్ భేటీ..

తాజాగా మరోసారి మెగాస్టార్ చిరంజీవిని కలిశారు ఎగ్జిబిటర్స్.(Chiranjeevi)

  • Published on- May 27, 2026 / 05:33 PM IST

Chiranjeevi

Chiranjeevi : గత కొన్నాళ్లుగా టాలీవుడ్ లో థియేటర్స్ సమస్య కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తెలంగాణ ఎగ్జిబిటర్లు తమకు పర్సెంటేజ్ విధానమే కావాలి అని, అలా అయితేనే సినిమాలు రిలీజ్ చేస్తామని, రాబోయే పెద్ది సినిమాకు కూడా పర్సెంటేజ్ విధానంలో అయితేనే రిలీజ్ చేస్తామని అల్టిమేటం జారీ చేసారు. దీంతో నిర్మాతలు, ఫిలిం ఛాంబర్ కూడా ఎగ్జిబిటర్లతో చర్చలు జరుపుతున్నారు.

ఈ చర్చలు ఇంతకీ కొలిక్కి రాకపోవడంతో ఇటీవల మెగాస్టార్ చిరంజీవిని తెలంగాణ ఎగ్జిబిటర్లు కలిసి తమ సమస్యలను చెప్పుకున్నారు. తాజాగా మరోసారి మెగాస్టార్ చిరంజీవిని కలిశారు ఎగ్జిబిటర్స్. తెలంగాణ ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ శేఖర్ రావు, సెక్రటరీ శ్రీధర్, అనుపమ్ రెడ్డి, బాలగోవింద్ రాజు, భరత్ నారంగ్, పలువురు ఎగ్జిబిటర్లు ఈ సమావేశానికి హాజరు అయ్యారు.

Also Read : Pawan Kalyan : పైరసీ పై ఫోకస్ చేసిన పవన్ కళ్యాణ్.. అమిత్ షాతో మీటింగ్.. నిర్మాత వ్యాఖ్యలు వైరల్..

సోమవారం చిరంజీవితో భేటీ అనంతరం నేడు మరోసారి చిరంజీవి నుంచి ఎగ్జిబిటర్స్ కు పిలుపు రావడంతో వెళ్లి కలిశారు. ఎగ్జిబిటర్స్ డిమాండ్ చేస్తున్న పర్సెంటేజ్ విధానం పై ఈ రోజు జరిగే సమావేశంలో ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. ఎగ్జిబిటర్స్ వర్సెస్ నిర్మాతల పర్సంటేజ్ వివాదం చిరంజీవి జోక్యంతో పరిష్కారం
అయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం. పెద్ది రిలీజ్ కూడా ఉండటంతో స్వయంగా చిరంజీవే రంగంలోకి దిగారు. మరోవైపు పలువురు నిర్మాతలు నిన్న పవన్ కళ్యాణ్ ని కూడా కలిశారు.