C 202 Movie Trailer : ‘సి 202’ ట్రైలర్ విడుదల.. హారర్ సన్నివేశాలతో సస్పెన్స్ స్క్రీన్ ప్లే..
హారర్ సన్నివేశాలతో సస్పెన్స్ స్క్రీన్ ప్లేతో 'సి 202' ట్రైలర్ విడుదల.
- gum 95921
- Published On : February 22, 2024 / 06:34 PM IST
Telugu new horror movie C 202 Trailer released
C 202 Movie Trailer : టాలీవుడ్ లో కొత్త కథ కథనాలతో సినిమాలు రూపొందుతున్నాయి. తాజాగా అలా తెరకెక్కి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దమవుతున్న సినిమా ‘సి 202’. హర్రర్ థ్రిల్లర్ కథతో రాబోతున్న ఈ చిత్రాన్ని మున్నా కాశి డైరెక్ట్ చేశారు. తనికెళ్ళ భరణి, శుభలేఖ సుధాకర్, సత్య ప్రకాష్, షఫీ, చిత్రం శీను, వై విజయ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.
తాజాగా ఈ మూవీ ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ట్రైలర్ ని ఒక డైలాగ్ కూడా లేకుండా అదిరిపోయే సౌండ్ ఎఫెక్ట్స్ తో రెండు నిమిషాల ఎనిమిది సెకెన్లతో ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చారు. ట్రైలర్ చూస్తుంటే కథ మొత్తం ఒక ఇల్లు చుట్టూ తిరుగుతుందని తెలుస్తుంది. సస్పెన్స్ స్క్రీన్ ప్లేతో హారర్ బ్యాక్‌డ్రాప్ తో థియేటర్స్ లో ఆడియన్స్ ని బయపెట్టనున్నారు. ఆ ట్రైలర్ ని మీరు కూడా చూసేయండి.
Also read : Ram Charan : రామ్‌చరణ్ పై మెగా ఫ్యాన్స్ చేస్తున్న ఈ మీమ్స్ చూస్తే.. నవ్వకుండా ఉండలేరు..
https://youtu.be/3ahnJsdwmgk
మైటీ ఒక్ పిక్చర్స్ బ్యానర్ పై మనోహరి కె ఎ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక దర్శకత్వం వహిస్తున్నమున్నా కాశినే హీరోగా నటిస్తున్నారు. అంతేకాదు సంగీతం, ఎడిటింగ్ భాద్యతలను కూడా మున్నానే చూసుకుంటున్నారు. షూటింగ్ అంత పూర్తి చేసుకుని ఈ చిత్రం ప్రస్తుతం పోస్టుప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది. త్వరలోనే మూవీ రిలీజ్ డేట్ ని కూడా అనౌన్స్ చేసి థియేటర్స్ లోకి తీసుకు వస్తామని నిర్మాతలు పేర్కొన్నారు.
