Ram Charan : రామ్‌చరణ్‌పై మెగా ఫ్యాన్స్ చేస్తున్న ఈ మీమ్స్ చూస్తే.. నవ్వకుండా ఉండలేరు..

'అత్తమ్మ కిచెన్స్' అంటూ రామ్ చరణ్ చేస్తున్న పోస్టులకు మెగా ఫ్యాన్స్ చేస్తున్న మీమ్స్ చూస్తే.. మీరు తప్పకుండా నవ్వుతారు.

Ram Charan : రామ్‌చరణ్‌పై మెగా ఫ్యాన్స్ చేస్తున్న ఈ మీమ్స్ చూస్తే.. నవ్వకుండా ఉండలేరు..

Mega Fans meme videos on Game Changer star Ram Charan gone viral

Updated On : February 22, 2024 / 6:49 PM IST

Ram Charan : మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నుంచి ఓ సినిమా వచ్చి రెండేళ్లు అయ్యిపోతుంది. ఆర్ఆర్ఆర్ తరువాత ఆచార్యలో ఒక ముఖ్య పాత్రలో కనిపించిన రామ్ చరణ్.. గత మూడేళ్ళుగా ‘గేమ్ ఛేంజర్’ షూటింగ్‌ని జరుపుకుంటూనే వస్తున్నారు. ఇప్పటికి కూడా ఈ మూవీ రిలీజ్‌పై ఒక క్లారిటీ లేదు. అసలు షూటింగ్ ఎంత అయ్యింది అనేది కూడా సమాచారం లేదు. చరణ్ ఈ సినిమా అప్డేట్స్ తప్ప అన్ని ఇస్తూ వస్తున్నారు.

తన సినిమా అప్డేట్‌ని పక్కన పెట్టి ఇతర హీరోల సినిమాల అప్డేట్స్ ని తెలియజేస్తూ వస్తున్న రామ్ చరణ్‌ని చూసి అభిమానులు తెగ బాధ పడిపోతున్నారు. ఇక రీసెంట్‌గా ఉపాసన తన అత్త సురేఖతో కలిసి ‘అత్తమ్మ కిచెన్స్’ అంటూ కొత్త వ్యాపారం స్టార్ట్ చేశారు. ఇక దీనిపై రామ్ చరణ్ రియాక్ట్ అవుతూ.. ఇన్‌స్టా స్టోరీ పెట్టడం, ఉపాసన పెట్టిన పోస్టు కింద కామెంట్ పెట్టారు. ఉపాసన పోస్టుకి చరణ్.. ‘టేస్ట్ అదిరింది మీరు ట్రై చేయండి’ అంటూ కామెంట్ చేశారు.

Also read: అన్నదమ్ములను తండ్రే పట్టించాడా.. షణ్ముఖ్ తండ్రి సమాచారంతోనే కేసు నమోదు..

ఈ కామెంట్ చూసిన మెగా అభిమానులు.. ‘ఎసువంటి ఎసువంటి బాక్స్ ఆఫీస్ రికార్డులు షేక్ చేసే వాడివి అన్న. ఇప్పుడు టేస్ట్ బాగుంది అంటూ రివ్యూలు ఇస్తున్నావు. రామ్ చరణ్ ఫ్యాన్‌గా ఉండడం అంత ఈజీ పని కాదు’ అంటూ ఫన్నీ మీమ్ వీడియోలు క్రియేట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. మరి ఆ మీమ్ వీడియోలను చూసి మీరు ఎంజాయ్ చేసేయండి.

కాగా గేమ్ ఛేంజర్ కొత్త షెడ్యూల్ షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిలింసిటీలో జరుగుతుంది. శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రానికి కార్తీక్ సుబ్బరాజ్ కథని అందించారు. కియారా అద్వానీ, అంజలి హీరోయిన్స్‌గా నటిస్తున్న ఈ సినిమాలో ఎస్‌జె సూర్య, శ్రీకాంత్, నాజర్, నవీన్ చంద్ర, సముద్రఖని, సునీల్ తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు.