Shanmukh Jaswanth : అన్నదమ్ములను తండ్రే పట్టించాడా.. షణ్ముఖ్ తండ్రి సమాచారంతోనే కేసు నమోదు..

షణ్ముఖ్ మరియు అతడి సోదరుడు సంపత్‌ని వారి తండ్రే పట్టించారా. ఆయన సమాచారంతోనే కేసు నమోదు అవ్వడం..

Shanmukh Jaswanth : అన్నదమ్ములను తండ్రే పట్టించాడా.. షణ్ముఖ్ తండ్రి సమాచారంతోనే కేసు నమోదు..

Telugu YouTuber Shanmukh Jaswanth Sampath Vinay police case full details

Updated On : February 22, 2024 / 4:49 PM IST

Shanmukh Jaswanth : షార్ట్ ఫిలిమ్స్‌తో యూత్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకొని, బిగ్‌బాస్ ద్వారా తెలుగు ఆడియన్స్ లో మంచి గుర్తింపుని అందుకున్న నటుడు ‘షణ్ముఖ్’. తాజాగా ఈ నటుడుని మరియు అతడి సోదరుడు సంపత్‌ని నార్సింగి పోలీసులు అరెస్ట్ చేసారు.

అసలు ఏం జరిగిందంటే.. వైజాగ్ కి చెందిన ఓ డాక్టర్ యువతితో స్నేహం చేసిన షణ్ముఖ్ ఆమెకు షార్ట్ ఫిల్మ్స్ లో అవకాశం ఇప్పిస్తానని చెప్పారు. ఈక్రమంలోనే తన అన్న సంపత్ వినయ్ కి ఆ అమ్మాయిని పరిచయం చేశాడు. ఇక సంపత్ వినయ్ మరియు ఆ యువతి మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారింది. పదేళ్లుగా ప్రేమించుకున్న ఇద్దరు.. ఇంట్లో ఒప్పించి పెళ్లి కూడా ఫిక్స్ చేసుకున్నారు.

మూడేళ్ల క్రితం వైజాగ్ లో ఇరు కుటుంబాల సమక్షంలో ఇద్దరికీ ఎంగేజ్మెంట్ జరిగింది. అయితే యువతి తల్లికి అనారోగ్యం కారణంగా పెళ్లి వాయిదా పడుతూ వచ్చింది. ఇక ఇంతలో సంపత్ వేరే యువతిని పెళ్లి చేసుకోవడానికి సిద్దమైనట్లు యువతికి షణ్ముఖ్ తండ్రి అప్పారావు సమాచారం ఇచ్చారు. ఆ సమాచారంతో యువతి నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇక యువతి ఫిర్యాదుతో పోలీసులు సంపత్ వినయ్ ఫ్లాట్ కి వెళ్లారు.

Also read : Radhan : చెన్నైలో ఉన్నాడు కాబట్టి బ్రతికిపోయాడు.. తమిళ మ్యూజిక్ డైరెక్టర్‌పై తెలుగు మేకర్స్ ఆగ్రహం..

పోలీసులు వెళ్లిన సమయానికి ఫ్లాట్ లో సంపత్ తో పాటు షణ్ముక్ కూడా అక్కడే ఉన్నారు. ఇక ఫ్లాట్ ని సోదా చేసిన పోలీసులకు అక్కడ గంజాయి దొరికింది. దీంతో షణ్ముక్, సంపత్ వినయ్ లను అదుపులోకి తీసుకుని నార్సింగ్ పోలీసులు విచారిస్తున్నారు. ఫిర్యాదు చేసిన ఆ యువతి కూడా పోలీస్ స్టేషన్ లోనే ఉంది. ఆమె అన్నదమ్ములతో పాటు షణ్ముఖ్ ఫ్యామిలీ మొత్తం తనను మోసం చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం.

ప్రస్తుతం కెరీర్ లో స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న షణ్ముఖ్.. ఈ కేసులో ఎంత వరకు భాగమయ్యారు అనేది తెలియాల్సి ఉంది. కాగా షణ్ముఖ్ గతంలో కారు రాష్ డ్రైవింగ్ కేసులో కూడా పోలీస్ కేసుని ఎదుర్కొని బాగా వైరల్ అయ్యారు. ఇప్పుడు మరోసారి ఇలా పోలీస్ స్టేషన్ కి వెళ్లారు.