Dream Catcher : డ్రీమ్ బేస్డ్ సైకాలజికల్ థ్రిల్లర్.. ‘డ్రీమ్ క్యాచర్’ ఫస్ట్ లుక్ రిలీజ్..

కలల నేపథ్యంతో సైకాలజికల్ థ్రిల్లర్ గా రాబోతున్న 'డ్రీమ్ క్యాచర్' ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది.

Telugu new psychological thriller movie Dream Catcher first look release

Dream Catcher : CL మోషన్ పిక్చర్స్ బ్యానర్ పై సందీప్ కాకుల నిర్మాతగా, దర్శకుడిగా తెరకెక్కిస్తున్న సినిమా ‘డ్రీమ్ క్యాచర్’. ప్రశాంత్ కృష్ణ, అనీషా ధామ, శ్రీనివాస్ రాంరెడ్డి, ఐశ్వర్య హోలక్కల్, సందీప్ కాకుల.. పలువురు ముఖ్య పాత్రలతో ఈ సినిమా తెరకెక్కుతుంది. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్ ఈవెంట్ జరిగింది.

‘డ్రీమ్ క్యాచర్’ సినిమా ఫస్ట్ లుక్ విడుదల వేడుక హైద్రాబాద్ ఫిలిం ఛాంబర్లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో దర్శక నిర్మాత సందీప్ కాకుల మాట్లాడుతూ.. ఈ సినిమాని మా కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో దర్శకుడిగా, నిర్మాతగా తెరకెక్కించాను. ఈ ఏడాది బెస్ట్ సినిమాల్లో ఇది కూడా నిలుస్తుంది. క్లైమాక్స్ చూస్తే వావ్ అంటారు. డ్రీమ్ బేస్డ్ సైకలాజికల్ థ్రిల్లర్ గా ఈ ‘డ్రీమ్ క్యాచర్ సినిమా అందబోతుందని తెలిపాడు.

Also read : Sarkaar Season 4 : సర్కార్ సీజన్ 4 ప్రోమో చూశారా.. కమ్‌బ్యాక్‌తో నవ్వుల సుడిగాలి సృష్టిస్తున్న సుధీర్..

ట్రెండింగ్ వార్తలు