Suhas : తమిళ్ లోకి ఎంట్రీ ఇస్తున్న తెలుగు యువ హీరో.. ఏ సినిమాలో తెలుసా? ఇక్కడ వరుస సక్సెస్ లు.. అక్కడ ఏం చేస్తాడో..

ప్రస్తుతం సుహాస్ పలు సినిమాల్లో కీలక పాత్రలు చేస్తూనే వెబ్ సిరీస్ లు, మరోవైపు హీరోగా కూడా వరుస సినిమాలు చేస్తున్నాడు.

Telugu Star Actor Suhas Entry in Tamil Film Industry with Soori Movie

Suhas : షార్ట్ ఫిలిమ్స్ తో కెరీర్ మొదలుపెట్టిన సుహాస్ ఆ తర్వాత సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచి ఇప్పుడు హీరోగా ఎదిగాడు. కలర్ ఫోటో సినిమాతో కరోనా సమయంలో భారీ హిట్ కొట్టి, ఆ సినిమాకు నేషనల్ అవార్డు రావడంతో సుహాస్ ఒక్కసారిగా స్టార్ అయ్యాడు. ఆ తర్వాత హీరోగా వరుసగా రైటర్ పద్మభూషణ్, అంబాజీపేట మ్యారేజి బ్యాండు, ప్రసన్న వదనం.. సినిమాలతో హిట్స్ కొట్టాడు. హిట్ 2 సినిమాలో విలన్ గా చేసి అదరగొట్టి అందర్నీ ఆశ్చర్యపరిచాడు.

Also Read : Police Stories : అందరూ మళ్ళీ పోలీస్ పాత్రలపైనే పడ్డారుగా.. నాని టు ప్రభాస్..

ప్రస్తుతం సుహాస్ పలు సినిమాల్లో కీలక పాత్రలు చేస్తూనే వెబ్ సిరీస్ లు, మరోవైపు హీరోగా కూడా వరుస సినిమాలు చేస్తున్నాడు. త్వరలోనే ఓ భామ అయ్యో రామ సినిమాతో రాబోతున్నాడు. అయితే సుహాస్ ఇప్పుడు తమిళ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. నేడు సుహాస్ తమిళ్ సినిమాని ప్రకటించారు.

తమిళ్ స్టార్ కమెడియన్ సూరి మెయిన్ లీడ్ లో తెరకెక్కుతున్న మందాడి సినిమాలో సుహాస్ కీలక పాత్రలో నటించబోతున్నాడు. నేడు ఈ విషయాన్ని మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇన్నాళ్లు తెలుగులో మెప్పించిన సుహాస్ ఇప్పుడు తమిళ్ లో ఎంట్రీ ఇస్తుండటంతో అభినందనలు తెలియచేస్తున్నారు. ఇటీవల విజయ్ సేతుపతితో ఓ ఇంటర్వ్యూ చేసి తమిళ్ వాళ్లకు కాస్త దగ్గరయ్యాడు సుహాస్. ఈ సినిమాతో మరింత దగ్గరయి తమిళ్ లో కూడా వరుస సినిమాలు చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు.