తల అజిత్ 60 – ‘వలిమై’ ప్రారంభం

హెచ్.వినోద్ దర్శకత్వంలో, బోనీ కపూర్ నిర్మాణంలో ‘తల’ అజిత్ కుమార్ నటిస్తున్న 60వ సినిమా.. ‘వలిమై’ చెన్నైలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది..

  • Publish Date - October 19, 2019 / 05:48 AM IST

హెచ్.వినోద్ దర్శకత్వంలో, బోనీ కపూర్ నిర్మాణంలో ‘తల’ అజిత్ కుమార్ నటిస్తున్న 60వ సినిమా.. ‘వలిమై’ చెన్నైలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది..

‘తల’ అజిత్ కుమార్ నటించిన ‘నేర్కొండ పార్వై’  (పింక్ రీమేక్) సినిమాతో ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ తమిళ సినీ పరిశ్రమలోకి ఎంటర్ అయ్యారు. ‘ఇంగ్లీష్ వింగ్లీష్’లో నటించేప్పుడు తన భార్య స్వర్గీయ శ్రీదేవి.. అజిత్‌తో ఓ సినిమా నిర్మించాలి అని చెప్పడంతో ‘నేర్కొండ పార్వై’ చిత్రానికి శ్రీకారం చుట్టామని, దీంతో శ్రీదేవి కోరిక నెరవేర్చానని బోనీ కపూర్ మూవీ ప్రమోషన్స్‌లో ఉద్వేగంగా చెప్పిన సంగతి తెలిసిందే..

హెచ్.వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘నేర్కొండ పార్వై’.. తమిళనాట ఘనవిజయం సాధించింది.. ఈ సినిమా తర్వాత వెంటనే అజిత్‌తో మరో సినిమా చేస్తున్నారు బోనీ.. హీరో, నిర్మాత, దర్శకుడు, సంగీత దర్శకుడు వెంటనే మరో సినిమా చేయడం అనేది చాలా అరుదుగా జరుగుతుంటుంది. అజిత్ నటిస్తున్న 60వ సినిమా ఇది. రీసెంట్‌గా చెన్నైలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.

Read Also : ‘ఫ్రోజెన్ 2’ కోసం కలిసిన చోప్రా సిస్టర్స్

స్వర్గీయ శ్రీదేవి చిత్ర పటానికి నివాళులు అర్పించి సినిమాను ప్రారంభించారు. దేవుడి పటాలపై బోనీ కపూర్ క్లాప్ నిచ్చారు. ఈ సినిమాకు ‘వలిమై’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందనున్న ఈ మూవీలో నయనతారను హీరోయిన్‌గా తీసుకునే అవకాశముందని తెలుస్తోంది. యువన్ శంకర్ రాజా మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. త్వరలో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది.