Hero Ajith: అజిత్ అభిమానులకు సింపుల్ గిఫ్ట్

దేశవ్యాప్తంగా.. నటనతో పాటు సింప్లిసిటీకి మారుపేరుగా వినిపించే పేరు తలా అజిత్. కేవలం తమిళ అభిమానులు మాత్రమే కాకుండా హిందీ ప్రేక్షకులు సైతం ఈ టాలెంటెడ్ యాక్టర్ కు బ్రహ్మరథం పడతారు.

Thala Ajith Clicked Taking An Auto Ride1

Hero Ajith: దేశవ్యాప్తంగా.. నటనతో పాటు సింప్లిసిటీకి మారుపేరుగా వినిపించే పేరు తలా అజిత్. కేవలం తమిళ అభిమానులు మాత్రమే కాకుండా హిందీ ప్రేక్షకులు సైతం ఈ టాలెంటెడ్ యాక్టర్ కు బ్రహ్మరథం పడతారు. రీసెంట్‌గా హిందీలో డబ్బింగ్ చేస్తున్న సినిమాలు సైతం సూపర్ హిట్ కొడుతున్నాయి.

Untitled Design (1)

ఇటీవల అజిత్ వీడియో ఒకటి వైరల్ గా మారింది. అది చూసి తలా అభిమానులు ఫుల్ జోష్ తో కనిపిస్తున్నారు. ‘మా హీరో అంతే.. చాలా సింపుల్‌’ అంటూ కాంప్లిమెంట్లు ఇచ్చేస్తున్నారు. ఇలా అభినందించడానికి కారణం అజిత్‌ చేసిన ఆటో ప్రయాణమే. ఇటీవల చెన్నైలో ఆటోలో వెళుతూ కనిపించారు అజిత్‌.

Untitled Design

ముఖానికి మాస్క్‌ ఉన్నప్పటికీ అది కచ్చితంగా అజితే అని అర్థమైపోతుంది. ఆయన్ను గుర్తుపట్టి అభిమానులు వీడియో తీశారు. ‘అంత పెద్ద స్టార్‌ హీరో ఇలా ఆటో ప్రయాణం చేయడం ఆయన సింప్లిసిటీకి నిదర్శనం. నిరాడంబరతకు చిరునామా ఆయన’ అంటూ పొగిడేస్తున్నారు. సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ‘వలిమై’ అనే చిత్రంలో నటిస్తున్నారు అజిత్‌.