అల్టిమేట్ స్టార్ ఔదార్యం-భారీ విరాళం..

కరోనాపై పోరుకి తమిళ స్టార్ హీరో అజిత్ భారీ విరాళమందించారు..

  • Publish Date - April 7, 2020 / 11:47 AM IST

కరోనాపై పోరుకి తమిళ స్టార్ హీరో అజిత్ భారీ విరాళమందించారు..

కోలీవుడ్ స్టార్ హీరో ‘తల’ అజిత్ కుమార్ క‌రోనాపై పోరుకి భారీ విరాళాన్ని ప్ర‌క‌టించారు. క‌రోనా మ‌హమ్మారి కార‌ణంగా దేశ‌మంతా లాక్‌డౌన్‌లో ఉంది. కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు క‌రోనా నివార‌ణ‌కు ప‌లు చ‌ర్య‌ల‌ను చేప‌డుతున్న సంగతి తెలిసిందే.

ప‌లువురు సెల‌బ్రిటీలు ప్ర‌భుత్వాల‌కు విరాళాల‌ను అందించ‌డ‌మే కాకుండా నైతికంగా త‌మ మ‌ద్ద‌తుని తెలియ‌జేస్తున్నారు. పలు ఇండస్ట్రీలకు చెందిన సినీ తార‌లు భారీగా విరాళాల‌ను అందిస్తున్నారు. తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కోటి 25 ల‌క్ష‌ల రూపాయ‌ల‌ను విరాళంగా ప్ర‌టించారు.

ఇందులో రూ.50 ల‌క్ష‌ల‌ను ప్ర‌ధానిమంత్రి స‌హాయ నిధికి, రూ.50 ల‌క్ష‌ల‌ను ముఖ్య‌మంత్రి స‌హాయ నిధికి ప్ర‌క‌టించారు. పాతిక ల‌క్ష‌ల‌ను ద‌క్షిణాది సినీ క‌ళాకారుల‌కు(ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా) విరాళంగా అందిస్తున్న‌ట్లు తెలిపారు. విపత్కర పరిస్థితిలో సినీ కార్మికులను, కళాకారులను ఆదుకోవడానికి ముందుకొచ్చిన అజిత్‌కు ‘FEFSI’ కృతజ్ఞతలు తెలిపింది.

Read Also : మిస్టర్ సూపర్ సీరియస్ సిగ్గుపడ్డ వేళ..