దళపతి 64 సమ్మర్‌లో విడుదల

దళపతి 64వ సినిమా షూటింగ్ అక్టోబర్‌లో స్టార్ట్ చేసి, 2020 సమ్మర్‌లో విడుదల చెయ్యనున్నారు.. లోకేష్ కనగరాజ్ ఈ సినిమాను డైరెక్ట్ చెయ్యనున్నాడు..

  • Publish Date - August 26, 2019 / 08:16 AM IST

దళపతి 64వ సినిమా షూటింగ్ అక్టోబర్‌లో స్టార్ట్ చేసి, 2020 సమ్మర్‌లో విడుదల చెయ్యనున్నారు.. లోకేష్ కనగరాజ్ ఈ సినిమాను డైరెక్ట్ చెయ్యనున్నాడు..

దళపతి విజయ్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో ‘బిగిల్’ సినిమా చేస్తున్నాడు. నయనతార హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీ స్పోర్ట్స్ అండ్ యాక్షన్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతుంది. దీపావళికి తమిళ్‌తో పాటు తెలుగులోనూ విడుదల చెయ్యాడానికి సన్నాహాలు చేస్తున్నారు. బిగిల్ సెట్స్ మీద ఉండగానే తన తర్వాతి సినిమాను కూడా లైన్‌లో పెట్టేశాడు విజయ్..

‘మా నగరం’.. తెలుగులో (నగరం) సినిమాతో దర్శకుడిగా పరిచయమైన లోకేష్ కనగరాజ్ ఈ సినిమాను డైరెక్ట్ చెయ్యనున్నాడు. ఎక్స్‌‌బీ ఫిల్మ్ క్రియేటర్స్ సంస్థ నిర్మిస్తుంది. విజయ్ నటిస్తున్న 64వ సినిమా ఇది. అక్టోబర్‌లో షూటింగ్‌ స్టార్ట్ చేసి, 2020 సమ్మర్‌లో విడుదల చెయ్యనున్నారు.

Read Also : ఫస్ట్ సౌత్ హాలీవుడ్ క్రాస్‌ఓవర్ మూవీగా నిశ్శబ్ధం..

అనిరుధ్ మ్యూజిక్, సంతోష్ శివన్ సినిమాటోగ్రఫీ అందించనున్నారు. ప్రస్తుతం విజయ్ బిగిల్ మూవీలో నటిస్తుండగా, లోకేష్ కార్తితో ‘ఖైదీ’ సినిమా చేస్తున్నాడు. అక్టోబర్‌లో ఈ చిత్రం విడుదల కానుంది.