దళపతి విజయ్ మైనపు విగ్రహం

కన్యాకుమారిలోని మయపురి వండర్ వ్యాక్స్ మ్యూజియంలో తమిళ స్టార్ దళపతి విజయ్ వ్యాక్స్ స్టాచ్యూ ఏర్పాటు చేశారు..

  • Publish Date - November 23, 2019 / 04:48 AM IST

కన్యాకుమారిలోని మయపురి వండర్ వ్యాక్స్ మ్యూజియంలో తమిళ స్టార్ దళపతి విజయ్ వ్యాక్స్ స్టాచ్యూ ఏర్పాటు చేశారు..

ఇళయ దళపతి విజయ్.. ఈ పేరు వింటే ఫ్యాన్స్‌కి పూనకాలే.. తమిళనాట  సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాత అంతటి ఇమేజ్, స్టార్‌డమ్ ఉన్న హీరోగా విజయ్‌.. ఇటీవల ‘బిగిల్’ (విజిల్) సినిమాతో మరో సూపర్ హిట్ కొట్టాడు. తాజాగా విజయ్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

కన్యాకుమారిలోని మయపురి వండర్ వ్యాక్స్ మ్యూజియంలో విజయ్ వ్యాక్స్ స్టాచ్యూ ఏర్పాటు చేశారు. ఇండియాలోనే ఇది ఫస్ట్ వ్యాక్స్ మ్యూజియం. ఈ మ్యూజియంలో వ్యాక్స్ స్టాచ్యూ ఏర్పాటే చేయబడ్డ ఫస్ట్ తమిళ్ యాక్టర్ విజయ్ కావడం విశేషం.

ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. విజయ్ ప్రస్తుతం ‘ఖైదీ’ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.

Read Also : కమల్ సర్జరీ సక్సెస్

ఎక్స్‌బి ఫిల్మ్ క్రియేటర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి విలన్‌గా నటించనున్నాడు. మాళవిక మోహనన్ విజయ్‌తో జత కడుతుంది. మలయాళ నటుడు ఆంటొని, శాంతను కీలక పాత్రలు చేస్తున్నారు. 2020 వేసవిలో విడుదల చెయ్యనున్నారు.