Game Changer : దీపావ‌ళికి గేమ్ ఛేంజ‌ర్ టీజ‌ర్‌! త‌మ‌న్ ట్వీట్ వైర‌ల్‌..

గ్లోబ‌ల్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ న‌టిస్తున్న మూవీ గేమ్ ఛేంజ‌ర్‌.

Thaman Gives Game Changer Teaser update

Game Changer Teaser update : గ్లోబ‌ల్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ న‌టిస్తున్న మూవీ గేమ్ ఛేంజ‌ర్‌. శంక‌ర్ ద‌ర్శ‌కత్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్‌. త‌మ‌న్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‍రాజు, శిరీష్ భారీ బడ్జెట్‌ తో నిర్మిస్తున్నారు. అంజలి, శ్రీకాంత్, SJ సూర్య, సునీల్.. ఇలా చాలా మంది స్టార్స్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈ మూవీ సంక్రాంతి కానుక‌గా జనవరి 10న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది.

ఇదిలా ఉంటే.. ఈ సినిమా టీజ‌ర్ ద‌స‌రా కానుక‌గా వ‌స్తుంద‌ని చాలా మంది భావించారు. అయితే.. ద‌స‌రాకు టీజ‌ర్ రాలేదు. కానీ ఇప్పుడు త‌మ‌న్ ట్వీట్ చూస్తుంటే ఈ చిత్ర టీజ‌ర్‌ దీపావ‌ళి వ‌చ్చేలాగా ఉంది.

Kiran Abbavaram : దీపావళి బరిలో కిరణ్ అబ్బవరం.. ‘క’ సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడంటే..

గేమ్ ఛేంజ‌ర్ టీజ‌ర్ వ‌ర్క్ చేస్తున్న‌ట్లు త‌మ‌న్ చెప్పుకొచ్చారు. వెలుగుతున్న ట‌పాసు ఎమోజీని పోస్ట్ చేశారు. దీన్ని చూస్తుంటే దీపావ‌ళి గేమ్ ఛేంజ‌ర్ టీజ‌ర్ వ‌స్తుంది అని చెప్ప‌క‌నే చెప్పిన‌ట్లుగా అర్థ‌మ‌వుతోంది.

Jani Master : జానీ మాస్టర్ ఇష్యూపై జనసేన నేత.. ఆమె మాకు కూడా మెసేజ్‌లు చేసింది.. ప్లాన్ చేసి ట్రాప్ చేశారనిపిస్తుంది..

ఇంకెందుకు ఆల‌స్యం.. దీపావ‌ళికి ట‌పాసుల మోత‌లాగా గేమ్ ఛేంజ‌ర్ టీజ‌ర్ మోత మోగిపోవాల‌ని అభిమానులు కోరుకుంటున్నారు.