Mahesh Babu : ‘సర్కారు వారి పాట’ సాంగ్ ట్యూన్ వినిపించేసిన తమన్
సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా పరశురామ్ డైరెక్షన్ లో రాబోతున్న సినిమా “సర్కారు వారి పాట”. కరోనా కారణంగా, ఇటీవల మహేష్ కి మోకాలి సర్జరీ, ఆ తర్వాత కరోనా రావడం........
- Saketh U
- Published On : January 23, 2022 / 12:12 PM IST
Thaman
Sarkaru Vari Paata : సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా పరశురామ్ డైరెక్షన్ లో రాబోతున్న సినిమా “సర్కారు వారి పాట”. కరోనా కారణంగా, ఇటీవల మహేష్ కి మోకాలి సర్జరీ, ఆ తర్వాత కరోనా రావడం.. వీటన్నితో సినిమా మరింత ఆలస్యం అవుతుంది. ఇంకా ఈ సినిమాకి ఒక షెడ్యూల్ షూటింగ్ మిగిలి ఉంది. ఇప్పటికే ఈ సినిమాని సమ్మర్ కి వాయిదా వేశారు. కానీ సర్కారు వారి పాట ఆగస్టుకి వాయిదా పడనున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే చాలా రోజుల నుంచి ఈ సినిమాపై ఎలాంటి అప్ డేట్ లేదు. అభిమానులు ఈ సినిమా నుంచి అప్ డేట్స్ కోసం ఎదురు చూస్తున్నారు.
Mahesh Babu: గౌతమ్‌ని డబ్బుంది కాబట్టి బతికించుకున్నాం.. లేని వాళ్ళ పరిస్థితి ఏంటి అని ఆలోచించా..
అయితే తాజాగా తమన్ సర్కారు వారి పాట సినిమాలోని సాంగ్స్ లో ఒక ట్యూన్ ని వినిపించేసాడు. చిత్ర యూనిట్ అధికారికంగా ఏదైనా రిలీజ్ చేస్తుంది అనుకున్నారు అంతా కానీ ఈ లోపు తమన్ సాంగ్ ట్యూన్ ని లీక్ చేసేసాడు. 40 సెకండ్స్ ఉన్న సాంగ్ ట్యూన్ ని తమన్ వినిపిస్తూ మధ్యలో మహేష్ బాబుతో ఉన్న ఫోటోని కూడా చూపిస్తూ వీడియో తీసాడు. ఈ వీడియోని తన ట్విట్టర్ లో పోస్ట్ చేసాడు తమన్. దీంతో మహేష్ అభిమానులు ఈ ట్యూన్ బాగుంది అంటూ వైరల్ చేసేస్తున్నారు.
And We Started it for Our S⭐️?? pic.twitter.com/Ihnlc0MHMD
— thaman S (@MusicThaman) January 22, 2022
