Mahesh Babu: గౌతమ్‌ని డబ్బుంది కాబట్టి బతికించుకున్నాం.. లేని వాళ్ళ పరిస్థితి ఏంటి అని ఆలోచించా..

ఈ సందర్భంలో మహేష్ బాబు మాట్లాడుతూ.. తను ఎందుకు చిన్నారులకు హార్ట్ ఆపరేషన్స్ చేయించాలని అనుకున్నారో అందుకు గల కారణాన్ని తెలియజేశారు................

Mahesh Babu: గౌతమ్‌ని డబ్బుంది కాబట్టి బతికించుకున్నాం.. లేని వాళ్ళ పరిస్థితి ఏంటి అని ఆలోచించా..

Mahesh Babu Nbk

Mahesh Babu :  బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న ‘అన్ స్టాపబుల్ విత్ NBk’ ఆహా ఓటీటీలో అదరగొడుతుంది. ఈ షోలో వచ్చిన గెస్టులతో కలిసి ప్రేక్షకులని బాలకృష్ణ తనదైన శైలిలో ఎంటర్టైన్ చేస్తున్నారు. IMDBలో 9.8 టాప్ రేటింగ్ తో నంబర్ 1 పొజిషన్ లో దూసుకుపోతుంది ఈ షో. ఇక ఈ సీజన్ లాస్ట్ ఎపిసోడ్ పదవ ఎపిసోడ్ కి గెస్ట్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు వస్తున్నారు. తాజాగా ఈ ఎపిసోడ్ ప్రోమోని రిలీజ్ చేశారు. ఈ ప్రోమోలో మహేష్ చాలా ఆసక్తికర విషయాలని వెల్లడించారు.

మహేష్ బాబు ఎంతో మంది హృద్యోగ సమస్యలు ఉన్న పేద చిన్నారులకి సహాయం చేసి వారికి తన సొంత డబ్బుతో ఆపరేషన్స్ చేయించి ప్రాణాలు కాపాడాడు. ఇప్పటివరకు 1058 మంది చిన్నారుల ప్రాణాలని కాపాడాడు మహేష్ బాబు. తాజాగా ‘అన్ స్టాపబుల్ విత్ NBk’ షోకి వచ్చిన మహేష్ ఈ ఆపరేషన్స్ వెనక ఉన్న కారణాన్ని చెప్పాడు.

Mahesh Babu : కరోనా తగ్గాక మొదటిసారి బయటకి వచ్చిన మహేష్.. రమేష్‌బాబు కార్యక్రమంలో..

బాలకృష్ణ మాట్లాడుతూ.. అన్ని దానాల కంటే అన్నదానం గొప్పదని అంటారు. ఆ అన్నదానం కంటే ప్రాణదానం ఇంకా గొప్పదంటారు. వెయ్యికి పైగా చిన్నారులకు గుండె ఆపరేషన్ చేయించి గుండెల్లో నిలిచిపోయాడు మహేష్ అని చెప్పి మహేష్ బాబు చేసిన సాయంతో హార్ట్ ఆపరేషన్స్ చేయించుకుని ప్రాణాలను దక్కించుకున్న ఇద్దరు చిన్నారులను వాళ్ళ పేరెంట్స్ ని స్టేజ్ మీదికి తీసుకుని వచ్చారు. ఆ చిన్నారుల తల్లిదండ్రులు కన్నీళ్లు పెట్టుకొని ఎమోషనల్ అయ్యారు.

Supritha : ఇది మ్యాటర్.. ప్రేమపై క్లారిటీ ఇచ్చిన సురేఖ కూతురు..

ఈ సందర్భంలో మహేష్ బాబు మాట్లాడుతూ.. తను ఎందుకు చిన్నారులకు హార్ట్ ఆపరేషన్స్ చేయించాలని అనుకున్నారో అందుకు గల కారణాన్ని తెలియజేశారు. ”గౌతమ్ ఆరు వారాలు ముందుగానే పుట్టేశాడు. పుట్టినప్పుడు సరిగ్గా నా చేయి అంతే ఉన్నాడు. ఇప్పుడు ఆరు అడుగులు ఉన్నాడు. మాకు డబ్బులు ఉన్నాయి కాబట్టి ఓకే కానీ చాలామంది లేని వాళ్లు ఉన్నారు. మరి వాళ్ల పరిస్థితి ఏంటి? ఆ చిన్నారులు ఏం కావాలి? అలాంటి వాళ్ల కోసం ఏదైనా చేయాలని అనుకున్నాను. అప్పటి నుంచి చిన్నారులకు హార్ట్ ఆపరేషన్స్ చేయిస్తున్నాను’ అని తెలిపారు.

మరోసారి మహేష్ బాబుని అభిమానులు, ప్రేక్షకులు పొగిడేస్తున్నారు. ఈ ఎపిసోడ్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఫిబ్రవరి 4న ఆహా ఓటీటీలో ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ అవ్వనుంది.