తండ్రికి తనయుడు ఇంత మంచి గిఫ్ట్ ఇచ్చినందుకు ఆనందంలో చిరు.. చెర్రీని ఆత్మీయ ఆలింగనం చేసుకుని, చిరు ముద్దు ఇచ్చారు..
మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన హిస్టారికల్ మూవీ.. సైరా నరసింహారెడ్డి.. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగుతో పాటు, హిందీ, తమిళ్, కన్నడ భాషల్లో ‘సైరా’ భారీగా విడుదలైంది.
అమితాబ్ బచ్చన్, నయనతార, తమన్నా, జగపతిబాబు, సుదీప్, విజయ్ సేతుపతి తదితరులు కీలక పాత్రల్లో నటించగా.. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో, కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్‌పై, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ భారీ బడ్జెట్‌తో నిర్మించిన సైరా మూవీ పాజిటివ్ టాక్ దక్కించుకుంది.
Read Also : చిరు ఉయ్యాలవాడకు ఊపిరి పోశారు : రాజమౌళి..
ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి తనయుడు చరణ్ ఒకరికొకరు కంగ్రాట్స్ చెప్పుకున్నారు. తండ్రికి తనయుడు ఇంత మంచి గిఫ్ట్ ఇచ్చినందుకు ఆనందంలో చిరు.. చెర్రీని ఆత్మీయ ఆలింగనం చేసుకుని, చిరు ముద్దు ఇచ్చారు.. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.