Chiranjeevi Tribute Song
Chiranjeevi Tribute Song: మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు ఆదివారం(ఆగస్ట్ 22). ఈ సందర్భంగా తెలుగు సినీ ప్రేక్షకాభిమానులు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియజేస్తున్నారు. కొందరు సోషల్ మీడియా ద్వారా చిరంజీవికి బర్త్‌డే విషెష్ చెబుతుంటే.. మరికొందరు ప్రత్యేకమైన వీడియోల ద్వారా అభినందనలను తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో దర్శక ద్వయం రమేష్ – గోపి తమ అభిమాన నటుడు మెగాస్టార్ చిరంజీవి కోసం ప్రత్యేకమైన ఓ వీడియో సాంగ్‌ను ట్రిబ్యూట్‌గా రూపొందించి.. తమ అభిమానాన్ని చాటుకున్నారు..
‘‘ఆకాశం వంగింది నీకై.. భూలోకం పొంగింది నీకై.. అభిమాన సంద్రం నీకుంది అండ.. ఇరవైలో అమ్మాయిలకైనా.. అరవైలో అమ్మమ్మలకైనా.. గుండెల్లో అనురాగం నింపే జెండా
నటన నీ నిచ్చెన.. నీ సాటి నువ్వే గురు.. నేలకే వచ్చిన నటరాజు నువ్వే చిరు.. తరం తరం స్థిరం చిరంజీవ.. నరం నరం స్వరం చిరంజీవ’’ అంటూ సాగే ఈ పాటలో వివిధ సందర్భాల్లో అభిమానులు ఆయనపై తమ అభిమానాన్ని చాటుకున్న వీడియోలను చూపించారు. ఒకవైపు చిరంజీవి నటనను, ఆయన చేసిన సేవా కార్యక్రమాలను గురించి ప్రస్తావించారు.
Happy Birthday Chiranjeevi : బాస్ బర్త్‌డే.. ‘మెగా’ విషెస్..
మేజిక్ యాక్సిస్, నౌదియాల్ మూవీ మేకర్స్ పతాకాలపై రోషిణి నౌదియాల్ నిర్మించిన ఈ సాంగ్‌ను చిర్రావూరి విజయ్ కుమార్ రాయగా, హేమచంద్ర ఆలపించారు. శ్రీ వసంత్ ఈ పాటకు సంగీతాన్ని అందించారు. ‘ఇది నా లవ్ స్టోరీ’ వంటి క్యూట్ లవ్ స్టోరీతో ప్రేక్షకులను మెప్పించి.. త్వరలోనే ‘రెడ్డి గారింట్లో రౌడీయిజం’ వంటి లవ్ అండ్ యాక్షన్ చిత్రంతో ఆకట్టుకోవడానికి సిద్ధమవుతున్న డైరెక్టర్స్ రమేష్ – గోపి.. ఈ పాటను మెగా ఫ్యాన్స్‌తో పాటు అందరికీ నచ్చేలా, అందరూ మెచ్చేలా రూపొందించారు.