Keedaa Cola : ఎట్టకేలకు తరుణ్ భాస్కర్ మూడో సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్.. కీడా కోలా వచ్చేది ఎప్పుడంటే?

తాజాగా నేడు తరుణ్ భాస్కర్ తన మూడో సినిమా రిలిజ్ డేట్ ని ప్రకటించారు.

Tharun Bhascker Keedaa Cola Movie Release Date announced

Keedaa Cola Movie : పెళ్లిచూపులు(Pelli Choopulu), ఈ నగరానికి ఏమైంది లాంటి సినిమాలతో మెప్పించిన తరుణ్ భాస్కర్(Tharun Bhascker) ఆ తర్వాత నటుడిగా, హోస్ట్ గా బిజీ అయ్యాడు. దీంతో తరుణ్ భాస్కర్ నుంచి మూడో సినిమా ఎప్పుడు వస్తుందా అని అభిమానులు, ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఇటీవల తన మూడో సినిమా కీడా కోలా ప్రకటించి శరవేగంగా షూట్ కూడా పూర్తి చేశాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి.

ఇటీవల కొన్ని రోజుల క్రితం కీడా కోలా టీజర్ కూడా రిలీజ్ చేసి సినిమాపై మరింత హైప్ పెంచాడు. ఇన్నాళ్లు సినిమా రిలీజ్ ఎప్పుడో చెప్పకపోవడంతో సోషల్ మీడియాలో కీడా కోలా రిలీజ్ డేట్ గురించి అప్డేట్స్ అడుగుతున్నారు. తాజాగా నేడు తరుణ్ భాస్కర్ తన మూడో సినిమా రిలిజ్ డేట్ ని ప్రకటించారు.

Jawan Collections : ఎనిమిది రోజుల్లోనే జవాన్ 700 కోట్లు.. 1000 కోట్ల టార్గెట్ రీచ్ అవుతుందా?

కీడా కోలా సినిమా నవంబర్ 3న థియేటర్స్ లో రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. VG సైన్మా ప్రొడక్షన్ నిర్మాణంలో తెరకెక్కిన కీడా కోలా సినిమాని సురేష్ ప్రొడక్షన్స్ రిలీజ్ చేస్తుంది. దర్శకుడిగా మొదటి రెండు సినిమాలతో మెప్పించిన తరుణ్ భాస్కర్ మరి మూడో సినిమా కీడా కోలాతో ఏ రేంజ్ లో మేపిస్తాడో చూడాలి.