Tharun Bhascker Keedaa Cola Teaser Released Brahmanandam Chaitanya Rao
Keedaa Cola Teaser : పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది సినిమాలతో యూత్ అందర్నీ అలరించిన దర్శకుడు తరుణ్ భాస్కర్ ఎట్టకేలకు తన మూడో సినిమాని ఆడియన్స్ ముందుకు తీసుకు రాబోతున్నాడు. ‘కీడా కోలా’ అనే టైటిల్ తో మూవీని అనౌన్స్ చేసి షూటింగ్ మొదలు పెట్టుకున్న చిత్ర యూనిట్.. నటీనటులు ఎవరు అన్నది ఇప్పటి వరకు తెలియజేయలేదు. తాజాగా టీజర్ ని రిలీజ్ చేసి ఈ సినిమాలో నటించే యాక్టర్స్ ని కూడా తెలియజేశాడు.
Pawan Kalyan Bro : మంగళగిరి పార్టీ కార్యాలయంలో బ్రో టీజర్ డబ్బింగ్ కంప్లీట్.. టీజర్ వచ్చేస్తుంది!
ఈ మూవీ టైటిల్ లోని కీడా అంటే బొద్దింక అని అర్ధం. టీజర్ లో ఈ కీడా ఒక కోలాలో చిక్కుకొని కనిపిస్తుంది. మూవీ స్టోరీ మొత్తం ఈ కీడా అండ్ కోలా చుట్టూ సాగబోతుందని టీజర్ చూస్తుంటే అర్ధమవుతుంది. ఇక ఈ సినిమాలో నటీనటులు విషయానికి వస్తే.. హాస్య బ్రహ్మ బ్రహ్మానందం ‘వరదరాజు’ అనే పాత్రలో కనిపించబోతున్నాడు. యూరిన్ బ్యాగ్ అటాచ్‌మెంట్ తో వీల్ చైర్ కే అంకితమైన పాత్రలో అలరించబోతున్నాడు. అలాగే ’30 వెడ్స్ 21′ వెబ్ సిరీస్ లో నటించిన చైతన్య రావు ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు.
Nikhil Siddhartha : ‘స్పై’ సినిమా రిలీజ్ తర్వాత సినిమాలకు గ్యాప్ ప్రకటించిన నిఖిల్.. మరి లైన్‌లో ఉన్న పాన్ ఇండియా సినిమాలు?
ఇక దర్శకుడు తరుణ్ భాస్కర్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నాడు. డాన్ రోల్ లో తరుణ్ భాస్కర్ కనిపించబోతున్నాడు. క్రైమ్ కామెడీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నాడు. అయితే ఈ మూవీని ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారనేది ఇంకా తెలియజేయలేదు. కాగా తరుణ్ భాస్కర్ నుంచి వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ కావడం, బ్రహ్మి ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్ర పోషించడంతో ఈ సినిమా పై ఆడియన్స్ లో మంచి క్యూరియాసిటీ నెలకుంది.