Tharun : పెళ్లి ప్రచారంపై క్లారిటీ ఇచ్చిన తరుణ్.. నేనే చెప్తారా బాబు చేసుకుంటే..

ఎప్పటికప్పుడు తరుణ్ వివాహం త్వరలో జరగబోతుందని వార్తలు తెరమీదకు వస్తూనే ఉంటాయి. ఇప్పుడు కూడా తరుణ్ వివాహం ఫిక్సయింది అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.

Tharun gives clarity on his marriage rumors

Tharun : టాలీవుడ్(Tollywood) లో బాల నటుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన తరుణ్ ఆ తర్వాత హీరోగా నువ్వే నువ్వే, నువ్వే కావలి.. లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలు అందించి లవర్ బాయ్ ఇమేజ్ తెచ్చుకున్నాడు. 90s కిడ్స్ కి తరుణ్ ఫేవరేట్ హీరో అయిపోయాడు. అమ్మాయిలకు మరింత ఫేవరేట్ అయ్యాడు తరుణ్. ఆ తర్వాత కొన్ని సినిమాలతో వరుస పరాజయం చూసిన తరుణ్ కొన్నాళ్లుగా సినిమాలకు గ్యాప్ ఇచ్చారు.

సినిమాలకు గ్యాప్ ఇచ్చినా సినిమా ఈవెంట్స్ లో మాత్రం అప్పుడప్పుడూ కనిపిస్తునే ఉంటారు. అలాగే సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటారు. అయితే 40 ఏళ్ళు వచ్చినా ఇంకా పెళ్లి గురించి మాత్రం చెప్పట్లేదు. ఎప్పటికప్పుడు తరుణ్ వివాహం త్వరలో జరగబోతుందని వార్తలు తెరమీదకు వస్తూనే ఉంటాయి. ఇప్పుడు కూడా తరుణ్ వివాహం ఫిక్సయింది అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఇండస్ట్రీలో ఓ స్టార్ నటుడి కూతురితో తరుణ్ వివాహం జరుగుతుందని వార్తలు వచ్చాయి.

Malli Pelli Movie : ‘మళ్ళీ పెళ్లి’ విడుదలపై కేసు కొట్టివేసిన కోర్టు.. నరేష్ ఇంట్లోకి రమ్య వెళ్లకూడదని ఆదేశాలు..

తాజాగా అతన పెళ్లిపై వస్తున్న వార్తలని తరుణ్ ఖండిస్తూ క్లారిటీ ఇచ్చారు. దీనిపై సోషల్ మీడియాలో తరుణ్ అధికారికంగా పోస్ట్ చేసాడు. నా పెళ్లి గురించి కొన్ని రూమర్స్ చూశాను. ఈ ప్రచారం నిజం కాదు. నేను ఏదైనా శుభవార్త చెప్పాలనుకుంటే నిరభ్యంతరంగా నా సోషల్ మీడియా వేదికగా లేదా మీడియా ముఖంగా ఆ విషయం చెబుతాను, పెళ్లి గురించి కూడా ఏదైనా ఉంటె నేనే చెప్తాను, నా పెళ్లి విషయంలో పుకార్లు నమ్మకండి, సృష్టించకండి. అర్ధం చేసుకుంటారని ఆశిస్తున్నాను అని తెలిపాడు తరుణ్.

ట్రెండింగ్ వార్తలు