Malli Pelli Movie : ‘మళ్ళీ పెళ్లి’ విడుదలపై కేసు కొట్టివేసిన కోర్టు.. నరేష్ ఇంట్లోకి రమ్య వెళ్లకూడదని ఆదేశాలు..

సినిమాల విడుదలకు వ్యతిరేకంగా రమ్యరఘుపతి కేసు దాఖలు చేసిన కారణాలను న్యాయస్థానం సమర్థించలేనిదని, న్యాయపరంగా నిలకడగా లేదని కోర్టు పేర్కొంది. బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ఆఫ్ ఇండియా సర్టిఫికేట్ ఇచ్చినట్లుగా ఈ సినిమా కంటెంట్ పూర్తిగా కల్పితమని కోర్టు నిర్ధారించింది.

Malli Pelli Movie : ‘మళ్ళీ పెళ్లి’ విడుదలపై కేసు కొట్టివేసిన కోర్టు.. నరేష్ ఇంట్లోకి రమ్య వెళ్లకూడదని ఆదేశాలు..

Naresh Pavitra Malli Pelli Movie releasing case dismissed in Court and Orders to Ramya Raghupathi should not go to Naresh house

Naresh : ప్రముఖ నటుడు డాక్టర్ VK నరేష్ మాజీ భార్య రమ్య రఘుపతి మళ్ళీ పెళ్లి( తెలుగు), మట్టే మదువే ( కన్నడ) చిత్రాన్ని థియేటర్లు, OTT ప్లాట్‌ఫారమ్‌లలో విడుదల చేయడాన్ని నిలిపివేయాలని గతంలో ఈ సినిమా రిలీజ్ కి ముందు బెంగుళూరులోని సిటీ సివిల్ కోర్టులో ఇంజక్షన్ దావా వేశారు. ఇన్ని రోజులుగా పెండింగ్, వాయిదాలతో సాగిన ఆ కేసుకి నేడు తీర్పు ఇచ్చింది కోర్టు. ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయస్థానం, రమ్య రఘుపతి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని మెరిట్‌లు లేని కారణంగా కొట్టివేస్తూ నేడు ఆగస్టు 1న తీర్పును వెలువరించింది.

సినిమాల విడుదలకు వ్యతిరేకంగా రమ్యరఘుపతి కేసు దాఖలు చేసిన కారణాలను న్యాయస్థానం సమర్థించలేనిదని, న్యాయపరంగా నిలకడగా లేదని కోర్టు పేర్కొంది. బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ఆఫ్ ఇండియా సర్టిఫికేట్ ఇచ్చినట్లుగా ఈ సినిమా కంటెంట్ పూర్తిగా కల్పితమని కోర్టు నిర్ధారించింది. సెన్సార్ బోర్డ్ సినిమా కల్పితమని సర్టిఫై చేసిన తర్వాత సినిమా విడుదలను ప్రైవేట్ వ్యక్తి అడ్డుకునే ప్రసక్తే లేదని కోర్టు పేర్కొంది.

తెలుగు, కన్నడ భాషలలో మళ్ళీ పెళ్లి సినిమా సినిమా థియేటర్లలో రిలీజయి పర్వాలేదనిపించింది. ఆ తర్వాత ఓటీటీలో కూడా రిలీజయి భారీ విజయం సాధించింది మళ్ళీ పెళ్లి సినిమా. సినిమా వచ్చి విజయం సాధించేసి వెళ్లిపోయిన తర్వాత సినిమా విడుదల ఆపాలని వేసిన కేసుకు ఇప్పుడు తీర్పు ఇవ్వడం గమనార్హం. ఇక ఈ తీర్పులో మళ్ళీ పెళ్లి సినిమా అన్ని OTT ప్లాట్‌ఫారమ్‌లు, శాటిలైట్‌ల ద్వారా నిర్మాతలు స్వేఛ్చగా ప్రసారం చేయవచ్చు అని కూడా తెలిపింది కోర్టు.

అలాగే మరో కేసులో నరేష్, కుటుంబ సభ్యులు.. రమ్య రఘుపతి ని నరేష్ నానక్‌రామ్‌గూడ ఇంట్లోకి ప్రవేశాన్ని నిషేధిస్తూ వేసిన ఇంజక్షన్ దావాను కోర్టు స్వీకరించింది. రమ్య రఘుపతి, నరేష్ పై గృహ హింస కేసు, నరేష్, పవిత్ర లోకేష్ పై ఇతర కేసు వేసిన విషయం తెలిసిందే. దీని తర్వాత నరేష్, ఆయన కుటుంబ సభ్యులు.. రమ్య రఘుపతిపై గృహ నిషేదం కేసు పెట్టడం జరిగింది. కేసును క్షుణ్ణంగా పరిశీలించిన కోర్టు నరేష్ ఇంట్లోకి రాకుండా నిషేధం విధిస్తూ రమ్యకు ఆదేశాలు జారీ చేసింది.

నరేష్, అతని కుటుంబం అందించిన సాక్ష్యాల ప్రకారం, రమ్య రఘుపతి అక్కడ నివాసం లేదు. ప్రాపర్టీని వ్యాపార ప్రయోజనాల కోసం ఉపయోగిస్తుంది. రమ్య కోసం వస్తున్న గుర్తు తెలియని వ్యక్తుల వలన అక్కడ నివసించే సీనియర్ సిటిజన్స్, నరేష్ అసౌకర్యంతో పాటు అందోళనకు గురి అవుతున్నారని కూడా కోర్టు పేర్కొంది.

Yadamma Raju : యాదమ్మ రాజుకు యాక్సిడెంట్ ఎలా జరిగింది..? ఆపరేషన్‌లో కాలి వేలు తీసేశారు.. ఎమోషనల్ అయిన రాజు..

ఇటీవలే పవర్ టీవీ అనే కన్నడ ఛానల్ చేత ఇల్లీగల్ గా నరేష్ ఇంటి మీద, పవిత్ర మీద స్టింగ్ ఆపరేషన్ లు జరిపిన విషయం అందరికి తెలిసిందే. నరేష్, రమ్య రఘుపతి 6 సంవత్సరాలు కలిసి జీవించడం లేదని కోర్టు నిర్ధారించింది. కోర్టు ఇచ్చిన తీర్పు నరేష్, రమ్యల విడాకులకు మార్గం సుగమం చేసింది. సుప్రీంకోర్టు నిబంధన ప్రకారం భార్య భర్తలు 2 లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలు కలిసి ఉండకపోతే వివాహం రద్దు చేయబడుతుంది. దీంతో వీరికి విడాకులు కూడా అధికారికంగా త్వరలోనే వచ్చే అవకాశం కూడా ఉంది.