Rahul Ramakrishna: లిప్ లాక్ ఫోటో పోస్ట్ చేసి పెళ్లి వార్త చెప్పిన కమెడియన్!
అదేంటో ఈ మధ్య కాలంలో ఏదైనా వెరైటీగా చెప్పాలి.. వెరైటీగా చేయాలని అనుకుంటున్నారు కొందరు సెలబ్రిటీలు. అందుకోసం కొందరు రకరకాలుగా సోషల్ మీడియాను కూడా వాడేసుకుంటున్నారు.
- Naresh Mannam
- Published On : May 8, 2022 / 09:30 AM IST
Rahul Ramakrishna
Rahul Ramakrishna: అదేంటో ఈ మధ్య కాలంలో ఏదైనా వెరైటీగా చెప్పాలి.. వెరైటీగా చేయాలని అనుకుంటున్నారు కొందరు సెలబ్రిటీలు. అందుకోసం కొందరు రకరకాలుగా సోషల్ మీడియాను కూడా వాడేసుకుంటున్నారు. తెలుగులో కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్న రాహుల్ రామకృష్ణ ఈ సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్ గా ఉంటూ ఉంటాడు. సినీ, రాజకీయ అంశాల నుండి హ్యూమరస్ పోస్టుల వరకు రాహుల్ ఎప్పుడూ ట్వీట్లు పోస్టులు పెడుతుంటాడు. అయితే.. ఈసారి పెట్టిన పోస్ట్ వెరైటీకే వెరైటీగా ఉంది.
Rahul Ramakrishna : ఇక సినిమాలు చేయను.. రాహుల్ రామకృష్ణ షాకింగ్ నిర్ణయం
ఎందుకంటే రాహుల్ తనకు కాబోయే భార్యకి లిప్ లాక్ ఇస్తూ తీసిన ఫోటో పోస్ట్ చేసి త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించాడు. తనకు కాబోయే భార్యకు ముద్దు ఇస్తున్న ఫొటోను ఆదివారం ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన రాహుల్.. గెట్టింగ్ మ్యారీడ్ ఫైనల్లీ అంటూ ఫొటోకు క్యాప్షన్ ఇచ్చాడు. త్వరలోనే తమ పెళ్లి జరుగనున్నట్లు వెల్లడించారు. రాహుల్ రామకృష్ణకు పలువురు అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతుండగా.. ఈ తరహాలో పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించిన తొలి పర్సన్ నువ్వే అంటూ కొందరు సెటైర్లు వేస్తున్నారు.
Rahul Ramakrishna: తూచ్ నేను జోక్ చేశా.. అందరినీ ఫూల్స్ చేసిన రాహుల్!
అర్జున్‌రెడ్డి సినిమాతో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా టాలీవుడ్‌లో అడుగుపెట్టిన రాహుల్ రామకృష్ణ.. జాతిరత్నాలు, హుషారు సినిమాల్లో కామెడీ క్యారెక్టర్స్‌తో ప్రేక్షకుల్ని నవ్వించారు. తెలంగాణ యాసలో డిఫరెంట్ బాడీలాంగ్వేజ్‌తో కామెడీని పండించే రాహుల్.. తాజాగా ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్ స్నేహితుడిగా కనిపించాడు. ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్న రాహుల్ ఫైనల్ గా తాను పెళ్లిచేసుకోబోతున్నట్లు తెలిపాడు. అయితే.. గతంలో సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించి తర్వాత తూచ్ జోక్ చేశానన్న రాహుల్.. ఈ పెళ్లి వార్తలో ఎలాంటి జోక్ లేకుండా ఓ ఇంటి వాడవుతాడో లేదో చూడాలి.
Getting married, finally, soonly! pic.twitter.com/o4Fg5XlsT6
— Rahul Ramakrishna (@eyrahul) May 7, 2022
