The Ghost: అక్కినేని నాగార్జున నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ది ఘోస్ట్’ ఇప్పటికే అన్ని పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. దర్శకుడు ప్రవీణ్ సత్తారు ఈ సినిమాను ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీగా తీర్చిదిద్దడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో నాగ్ ఓ ఎన్ఐఏ ఆఫీసర్ పాత్రలో నటిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆడియెన్స్ ఆతృతగా చూస్తున్నారు.
The Ghost Movie: ‘ది ఘోస్ట్’ మూవీ రన్‌టైమ్ లాక్.. ఎంతంటే..?
కాగా, తాజాగా ఈ చిత్ర రిలీజ్ ట్రైలర్‌ను చిత్ర యూనిట్ లాంఛ్ చేసింది. ఈ ట్రైలర్ ఆద్యంతం యాక్షన్ ఎలిమెంట్స్‌తో దుమ్ములేపింది. ముఖ్యంగా నాగార్జున చేసిన స్టైలిష్ యాక్షన్ సీక్వెన్స్‌లు ఈ ట్రైలర్‌కే హైలైట్ అని చెప్పాలి. ఇక ఈ యాక్షన్ సీన్స్‌ను ప్రవీణ్ సత్తారు తనదైన టేకింగ్‌తో ఆడియెన్స్‌ను కట్టిపడేయనున్నట్లు ఈ రిలీజ్ ట్రైలర్లో మనకు చూపించారు. నాగ్ అల్ట్రా స్టైలిష్ లుక్ కూడా ఈ సినిమాకు మరో మేజర్ అసెట్‌గా మారనుంది. కేవలం యాక్షన్‌కే కాకుండా ఎమోషన్స్, రొమాన్స్‌కు కూడా ఈ సినిమాలో స్కోప్ ఉన్నట్లుగా ఈ ట్రైలర్ చూస్తే తెలుస్తోంది.
The Ghost Movie: సెన్సార్ పనులు ముగించుకున్న ‘ది ఘోస్ట్’
దసరా కానుకగా అక్టోబర్ 5న రిలీజ్ కానున్న ఈ సినిమాపై నాగార్జున అండ్ టీమ్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కించగా.. మరో రెండు సినిమాలతో పోటీలో దిగుతోంది ఈ చిత్రం. మరి దసరాకు వస్తోన్న ది ఘోస్ట్ ఇతర చిత్రాలకు ఏస్థాయిలో పోటీ ఇస్తుందో చూడాలి.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్ కోసం 10TV చూడండి.