×
Ad

The Kerala Story : 100 కోట్లకు పైగా కలెక్షన్స్.. బాలీవుడ్ సినిమాలను దాటి దూసుకుపోతున్న కేరళ స్టోరీ..

కేవలం 20 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ది కేరళ స్టోరీ సినిమా మొదటి రోజే 8 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి ఆశ్చర్యపరిచింది. ఇక ఈ సినిమా పది రోజులకు ఏకంగా 112 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి ఫుల్ ఫామ్ లో ఉంది.

  • Published On : May 15, 2023 / 09:53 AM IST

The Kerala Story collects more than 100 crores gross in only 10 days

The Kerala Story :  గత కొన్ని రోజులుగా ది కేరళ స్టోరీ సినిమా వార్తల్లో నిలుస్తూనే ఉంది. కేరళలో(Kerala) కొంతమంది అమ్మాయిలను మతం మార్చి టెర్రరిజంలోకి తీసుకెళ్తున్నారు అనే కథాంశంతో, రియల్ సంఘటనల ఆధారంగా తెరకెక్కించాము అని చెప్తూ తీసిన సినిమా ది కేరళ స్టోరీ(The Kerala Story). టీజర్ రిలీజ్ నుంచి కూడా ఈ సినిమాపై పలు విమర్శలు వస్తూనే ఉన్నాయి. అదా శర్మ(Adah Sharma), సిద్ది ఇదాని(Siddhi Idnani), యోగితా.. పలువురు ముఖ్య పాత్రల్లో నటించగా సుదీప్తో సేన్ ఈ సినిమాని తెరకెక్కించారు.

ది కేరళ స్టోరీ సినిమా మే 5న దేశవ్యాప్తంగా రిలీజ్ చేశారు. కొంతమంది ఈ సినిమాను సపోర్ట్ చేస్తుంటే కొంతమంది మాత్రం సినిమాను విమర్శిస్తున్నారు. తమిళనాడు, బెంగాల్ రాష్ట్రాల్లో ఈ సినిమాను నిషేధించగా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ తో పాటు పలు రాష్ట్రాల్లో ఈ సినిమాకు ట్యాక్స్ ఫ్రీ కూడా ఇచ్చారు. ది కేరళ స్టోరీ సినిమా మౌత్ టాక్ తో మంచి విజయం సాధించింది.

Anni Manchi Shakunamule : ‘అన్నీ మంచి శకునములే’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్యాలరీ..

కేవలం 20 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ది కేరళ స్టోరీ సినిమా మొదటి రోజే 8 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి ఆశ్చర్యపరిచింది. ఇక ఈ సినిమా పది రోజులకు ఏకంగా 112 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి ఫుల్ ఫామ్ లో ఉంది. అసలు ఆడదు అనుకున్న ఈ సినిమా ఇప్పుడు ఏకంగా 100 కోట్లకు పైగా కలెక్ట్ చేయడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్, విద్యుత్ జమ్వాల్.. లాంటి పలువురు స్టార్, మీడియం హీరోల సినిమాలు రిలీజయినా అవి సాధించలేని ఫీట్ ని ఈ సినిమా సాధించడంతో సినిమాపై మరింత బజ్ ఏర్పడింది. ఇక నేటితో ఈ సినిమా ఏకంగా 136 కోట్లు వసూలు చేసి 200 కోట్లకు దూసుకుపోతుంది. ఇప్పటికి కొన్ని రాష్ట్రాల్లో ఈ సినిమా ఇంకా థియేటర్స్ లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. ఇంకెన్ని కలెక్షన్స్ చేస్తుందో చూడాలి ది కేరళ స్టోరీ.