The Vaccine War : ఆస్కార్‌కి ‘ది వ్యాక్సిన్ వార్‌’ సినిమా.. శాశ్వత స్థానం దక్కించుకుంది..

భారతీయ శాస్త్రవేత్తల గొప్పతనాన్ని చూపిస్తూ తెరకెక్కిన ‘ది వ్యాక్సిన్ వార్’ సినిమాకి అరుదైన ఘనత దక్కింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్‌..

The Vaccine War : ఆస్కార్‌కి ‘ది వ్యాక్సిన్ వార్‌’ సినిమా.. శాశ్వత స్థానం దక్కించుకుంది..

The Vaccine War movie Got a permanent position in Oscar Library

Updated On : October 12, 2023 / 6:48 PM IST

The Vaccine War : ‘ది కాశ్మీర్ ఫైల్స్’ సినిమాతో గత ఏడాది ఆడియన్స్ ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్టుని అందుకున్న బాలీవుడ్ దర్శకుడు ‘వివేక్ రంజన్ అగ్నిహోత్రి’.. ఇటీవల ‘ది వ్యాక్సిన్ వార్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రాన్ని భారతీయ శాస్త్రవేత్తల గొప్పతనాన్ని చూపిస్తూ రూపొందింది. కాశ్మీర్ ఫైల్స్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద 300 కోట్ల కలెక్షన్స్ ని రాబట్టడంతో ఈ మూవీ పై మంచి బజ్ క్రియేట్ అయ్యింది. సెప్టెంబర్ 28న ఈ మూవీ ఆడియన్స్ ముందుకు వచ్చింది.

ఈ చిత్రానికి విమర్శకుల ప్రశంసలు వచ్చినప్పటికీ.. కలెక్షన్స్ మాత్రం రాలేకపోయాయి. దీంతో బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద సందడి చేయాలకేపోయింది. అయితే తాజాగా ఈ మూవీ అరుదైన గౌరవం అందుకుంది. ఈ సినిమా ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్‌ లైబ్రరీలో స్థానం దక్కించుకుందట. ఈ విషయాన్ని వివేక్‌ అగ్నిహోత్రి స్వయంగా తెలియజేశాడు. ఆస్కార్ అకాడమీ నుంచి తనకి వచ్చిన మెయిల్ ని షేర్ చేస్తూ.. “ఆస్కార్‌ లైబ్రరీలో ది వ్యాక్సిన్ వార్‌ సినిమా స్క్రిప్ట్‌ శాశ్వత స్థానం దక్కించుకుంది” అంటూ పేర్కొన్నాడు.

Also read : Nani : నేను నిన్ను నమ్ముతున్నాను.. నువ్వు నన్ను నమ్ము.. ఎవరి కోసం నాని ఈ మాటలు..!

మన సూపర్ హీరోలు అయిన మన దేశ శాస్త్రవేత్తల కథలు గురించి ప్రపంచం మొత్తం తెలుసుకోబోతుంది అంటూ గొప్పగా చెప్పుకొచ్చాడు. ఇక ఈ విషయం తెలుసుకున్న నెటిజెన్స్.. అగ్నిహోత్రికి అభినందనలు చెబుతున్నారు. కాగా ఈ సినిమా కథ విషయానికి వస్తే.. కరోనా వచ్చిన సమయంలో మొత్తం ప్రపంచం ఎదురుకున్న సమస్యలను, దానిని నుంచి బయటపడేందుకు భారతీయ శాస్త్రవేత్తలు చేసిన పోరాటాన్ని ఈ మూవీలో చూపించారు. ఇటీవల ఈ సినిమా చూసిన ప్రధాని మోదీ కూడా మేకర్స్ అభినందించారు.