Pradeep K Vijayan : సినీ పరిశ్రమలో విషాదం.. అనుమానాస్పద స్థితిలో ప్రముఖ నటుడి మృతి..
సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది.
- Thota Vamshi Kumar
- Published On : June 13, 2024 / 08:29 PM IST
Thegidi actor Pradeep K Vijayan found dead at his house
సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ తమిళ నటుడు ప్రదీప్ విజయన్ అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించాడు. తాను నివాసం ఉంటున్న గదిలో విగతజీవిగా పడి ఉన్నాడు. కాగా.. అతడు మరణించి రెండు రోజులు అయి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.
చెన్నైలోని పాలవాక్కమ్‌లో గల ఓ ఫ్లాట్‌లో ప్రదీప్ ఒంటరిగా నివసిస్తున్నాడు. అయితే.. అతడికి గత రెండు రోజులుగా స్నేహితులు ఎన్ని సార్లు ఫోన్ చేసినా స్పందించలేదు. దీంతో అనుమానం వచ్చి వారి స్నేహితుల్లో ఒకరు అతడు నివసిస్తున్న ప్లాట్ వద్దకు వచ్చాడు. ఎన్ని సార్లు తలుపు కొట్టినా తీయకపోవడంతో పోలీసులకు సమాచారం అందించాడు. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని తలుపు పగల కొట్టి లోపలికి వెళ్లారు.
Devara : ఎన్టీఆర్ అభిమానులకు పండగే.. చెప్పిన తేదీ కంటే రెండు వారాల ముందుగానే వస్తున్న దేవర
కాగా.. బాత్రూమ్‌లో ప్రదీప్ విగతజీవిగా కనిపించాడు. అతడి మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం రాయపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తలకు బలమైన గాయం లేదా గుండెపోటుతో మృతి చెంది ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇదిలా ఉంటే.. కొద్ది రోజుల క్రితం ప్రదీప్ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడినట్లుగా అతడి స్నేహితుడు పోలీసులకు చెప్పాడు. అతడి మృతిపై పలువురు సినీ ప్రముఖలు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేస్తున్నారు. తెగిడి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రదీప్.. హస్యనటుడిగా, విలన్‌గా నటించాడు. ‘టెడ్డీ’, హే సినామిక వంటి చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు ఇతడు తెలుసు.
Chiranjeevi : ప్రధాని పలకరింపుపై చిరు ట్వీట్.. మెగాస్టార్‌తో ప్రధాని మోదీ ఏం మాట్లాడారంటే..?
