They Call Him OG
They Call Him OG : ఇటీవల రజినీకాంత్ కూలీ సినిమా వచ్చి పర్వాలేదనిపించింది. ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా కలెక్షన్స్ బానే ఉన్నాయి. అయితే కలెక్షన్స్ అనుకున్నంత రాలేదు. అందుకు కారణం సినిమాకు సెన్సార్ A సర్టిఫికెట్ రావడమే అని విశ్లేషకులు అంటున్నారు. కూలికి A సర్టిఫికెట్ ఇవ్వడం వల్ల చాలా మల్టీప్లెక్స్ లలో 18 ఏళ్ళ లోపు ఉన్న పిల్లలని రానివ్వలేదు.(They Call Him OG)
దీంతో చాలా ఫ్యామిలీలు సినిమాకు వచ్చి వెనుతిరిగాయి, కొన్ని ఫ్యామిలీలు అసలు రాలేదు. ఇక పిల్లల్లో రజినీకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ తో సినిమాకు వెల్దామనుకున్నా A సర్టిఫికెట్ వల్ల కొన్ని థియేటర్స్ రానివ్వలేదు. దీంతో ఈ ఎఫెక్ట్ కూలీ సినిమాల కలెక్షన్స్ పై పడింది. దీనిపై కూలీ నిర్మాత హైకోర్టుకు కూడా వెళ్లారు. ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ OG సినిమాకు కూడా జరుగుతుందేమో అని భయపడుతున్నారు.
Also Read : Vasanthi Krishnan : OG మానియాలో బిగ్ బాస్ వాసంతి.. భర్తతో కలిసి స్పెషల్ OG డ్రెస్ లో పోజులు..
పవన కళ్యాణ్ OG సినిమాకు సెన్సార్ బోర్డు A సర్టిఫికెట్ ఇచ్చింది. అసలే పవన్ కళ్యాణ్ కి ఫ్యామిలిలో, పిల్లల్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, 18 ఏళ్ళ లోపు పిల్లలు కూడా జనసేనకు, పవన్ కళ్యాణ్ కు సపోర్ట్ గా ఉంటున్నారు. వాళ్లంతా థియేటర్స్ కి వెళ్తే రానిస్తారా? ఒకవేళ సింగిల్ స్క్రీన్స్ లో రానిచ్చినా మల్టీప్లెక్స్ లో కష్టమే. అసలే దసరా హాలిడేస్ కాబట్టి ఫ్యామిలీలు అంతా కలిసి సినిమాకు వెళ్లాలి అనుకుంటాయి. ఇలాంటి టైంలో A సర్టిఫికెట్ అని పిల్లల్ని రానివ్వకపోతే ఫ్యామిలీలు ఆగిపోయే ప్రమాదం ఉంది.
ఇది కచ్చితంగా OG కలెక్షన్స్ పై ఎఫెక్ట్ పడుతుంది. అయితే ఇందులో వైలెన్స్, రక్తపాతం ఎక్కువగా ఉందనే సెన్సార్ బోర్డు A సర్టిఫికెట్ ఇచ్చిందట. మూవీ యూనిట్ కనీసం యూ/ఏ కి ట్రై చేసినా బాగుండేది అని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఎంతో కొంత ఎఫెక్ట్ అయితే కచ్చితంగా ఉంటుందని అంటున్నారు బాక్సాఫీస్ విశ్లేషకులు.
Also See : Jyoti Poorvaj : పవన్ మీద అభిమానంతో.. OG స్పెషల్ డ్రెస్ తో జ్యోతి పూర్వాజ్..