Manikandan : ఆ దర్శకుడి నేషనల్ అవార్డు ఎత్తుకెళ్లిన దొంగలు.. సారీ చెప్పి తిరిగి ఇచ్చేస్తూ..

ఆ దర్శకుడి ఇంట్లో దొంగలు పడ్డారు. డబ్బు, నగలు, జాతీయ అవార్డుల తాలూకు పతకాలు దోచుకెళ్లారు. మనసు మార్చుకుని క్షమాపణలు చెబుతూ జాతీయ అవార్డును తిరిగి ఇచ్చేసారు. ఇంతకీ ఏ దర్శకుడి ఇంట్లో? చదవండి.

Manikandan

Manikandan : ప్రముఖ తమిళ డైరెక్టర్ ఎం మణికందన్ ఇంట్లో ఇటీవల చోరీ జరిగింది. డబ్బు, నగలతో పాటు ఆయనకు వచ్చిన జాతీయ అవార్డులను సైతం దొంగలు ఎత్తుకెళ్లారు.. ఏమనుకున్నారో ఏమో? డబ్బు, నగలు ఉంచుకుని క్షమాపణలు చెప్పి అవార్డును తిరిగి ఇచ్చేసారు. ఈ న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

Manikandan 2

Parakramam : బోల్డ్ డైరెక్టర్ బండి సరోజ్ కుమార్ ఈ సారి ‘పరాక్రమం’ అంటూ.. ప్రేమ అబద్దం.. ప్రేమ శాపం.. ప్రేమ మోసం..

మధురై ఉసియాంపట్టిలో జరిగిన ఓ సంఘటన అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. కాక్కా ముట్టై, కడైసి వివసాయి వంటి సినిమాలకు జాతీయ అవార్డును అందుకున్న ప్రముఖ దర్శకుడు ఎం మణికందన్ ఇంట్లో దొంగలు పడ్డారు. ఆ సమయంలో ఆయన కుటుంబం మొత్తం చెన్నైలో ఉంది. దొంగలు బంగారు ఆభరణాలు, డబ్బుతో పాటు విలువైన వస్తువులు దోచుకెళ్లారు. ఈ ఘటనపై మణికందన్ ఉసిలంపట్టి పోలీసులకు ఫిర్యాదు చేసారు. అయితే దొంగలు దోచుకెళ్లిన వస్తువుల్లో ఆయన అందుకున్న జాతీయ అవార్డు తాలుకూ షీల్డులు కూడా ఉన్నాయి.

ఈ ఘటన తర్వాత మణికందన్ ఇంటి కాంపౌండ్ వాల్‌కు వేలాడుతూ ఒక పాలథిన్ కవర్ కనిపించింది. అందులో ఏముందో చూసి మణికందన్ కుటుంబ సభ్యులు ఆశ్చర్యపోయారు. ఆయన అందుకున్న జాతీయ అవార్డు తాలుకూ షీల్డ్స్ ఆ కవర్‌లో వేసి దొంగలు అక్కడ పెట్టి వెళ్లారు. దాంతో పాటు ‘మమ్మల్ని క్షమించండి సోదరా.. మీ కృషి మీది’ అని ఒక నోట్ రాసి పెట్టారు. అవార్డులు వాపస్ వచ్చినా బంగారు ఆభరణాలు, డబ్బు రికవరీ కాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన పడుతున్నారు. మణికందన్ కుటుంబంతో పాటు చెన్నై నివాసం ఉంటున్నారు. ఉసిలంపట్టిలో ఉన్న ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ దొంగతనం జరిగింది. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Rashmi Gautam : నా మీద కావాలని నెగిటివ్ న్యూస్ ప్రచారం చేస్తున్నారు.. గుంటూరు కారం సినిమా వర్సెస్ రష్మీ..

మణికందన్ కాకా ముట్టై సినిమాతో డైరెక్టర్‌గా అరంగేట్రం చేసారు. ఆ సినిమా ఉత్తమ బాలల చిత్రంగా జాతీయ అవార్డును గెలుచుకుంది. కుట్రమే తండనై, ఆండవన్ కట్టలై వంటి సినిమాలు ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం విజయ్ సేతుపతితో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కోసం వెబ్ సిరీస్ చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు