Parakramam : బోల్డ్ డైరెక్టర్ బండి సరోజ్ కుమార్ ఈ సారి ‘పరాక్రమం’ అంటూ.. ప్రేమ అబద్దం.. ప్రేమ శాపం.. ప్రేమ మోసం..

ఆల్రెడీ గతంలోనే పరాక్రమం ప్రీ టీజర్ రిలీజ్ చేసిన బండి సరోజ్ కుమార్ తాజాగా వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ సినిమా రిలీజ్ అప్డేట్ ఇచ్చాడు.

Parakramam : బోల్డ్ డైరెక్టర్ బండి సరోజ్ కుమార్ ఈ సారి ‘పరాక్రమం’ అంటూ.. ప్రేమ అబద్దం.. ప్రేమ శాపం.. ప్రేమ మోసం..

Bandi Saroj Kumar Parakramam Movie Release Update on Valentines Day

Updated On : February 14, 2024 / 12:47 PM IST

Parakramam : నిర్బంధం, మాంగల్యం, సూర్యాస్తమయం.. లాంటి బోల్డ్ సినిమాలతో పాపులర్ అయిన డైరెక్టర్ బండి సరోజ్ కుమార్(Bandi Saroj Kumar) ఇప్పుడు మరో సరికొత్త సినిమాతో రాబోతున్నాడు. గల్లీ క్రికెట్, లవ్ కాన్సెప్ట్ తో మరో బోల్డ్ సినిమాగా ‘పరాక్రమం’తో రాబోతున్నాడు. ఆల్రెడీ గతంలోనే పరాక్రమం ప్రీ టీజర్ రిలీజ్ చేసిన బండి సరోజ్ కుమార్ తాజాగా వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ సినిమా రిలీజ్ అప్డేట్ ఇచ్చాడు.

బండి సరోజ్ కుమార్ ‘పరాక్రమం’ సినిమా 2024 సమ్మర్ లో రిలీజ్ కాబోతున్నట్టు ప్రకటించారు. ఈ అప్డేట్ ఇస్తూ ఓ వాయిస్ తో ఉన్న వీడియోని రిలీజ్ చేశారు. ఈ వీడియోని సినిమాలోని మూడు డైలాగ్స్ తో పోస్ట్ చేశారు. చివర్లో ప్రేమ అబద్దం.. ప్రేమ శాపం.. ప్రేమ మోసం.. అంటూ చెప్పడం గమనార్హం.

Also Read : Rashmi Gautam : నా మీద కావాలని నెగిటివ్ న్యూస్ ప్రచారం చేస్తున్నారు.. గుంటూరు కారం సినిమా వర్సెస్ రష్మీ..

ఇప్పటివరకు బండి సరోజ్ కుమార్ తన సినిమాలని డిజిటల్ లో ‘వాచ్ అండ్ పే’ పద్ధతి ద్వారా విడుదల చేసి మంచి విజయం సాధించాడు. ఇప్పుడు ఈ పరాక్రమం సినిమాని తన సొంత బ్యానర్ BSK మెయిన్ స్ట్రీమ్ ద్వారా థియేటర్లలో రిలీజ్ చేయనున్నాడు. ఇక ఈ సినిమాలో శాస్త్రీయ నృత్య కళాకారిణి శృతి సమన్వి, నాగలక్ష్మి హీరోయిన్లుగా నటించారు. మరో 50 మంది థియేటర్ ఆర్టిస్ట్ లు ఈ సినిమాతో పరిచయం కాబోతున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న పరాక్రమం సినిమా నుంచి త్వరలోనే టీజర్ విడుదల చేసి రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు.