Jayamma Panchayathi : సుమ సినిమా సాంగ్ అదిరిపోయిందిగా..

స్టార్ యాంకర్ సుమ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘జయమ్మ పంచాయితీ’ లోని ఫస్ట్ లిరికల్ సాంగ్ నేచురల్ స్టార్ నాని రిలీజ్ చేశారు..

Nani Suma

Jayamma Panchayathi: 1996లో దర్శకరత్న దాసరి నారాయణ రావు డైరెక్ట్ చేసిన ‘కళ్యాణ ప్రాప్తిరస్తు’ సినిమాతో కథానాయికగా ఎంట్రీ ఇచ్చిన సుమ తర్వాత బుల్లితెర సూపర్ స్టార్ అయిపోయారు. పాతికేళ్ల తర్వాత తిరిగి సినిమాల్లో నటిస్తున్నారామె.

Thank You Movie : కూల్ అండ్ స్టైలిష్ లుక్‌లో నాగ చైతన్య..

సుమ ప్రధాన పాత్రలో.. వెన్నెల క్రియేషన్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెం.2 గా తెరకెక్కుతున్న సినిమా ‘జయమ్మ పంచాయితీ’. విజయ్ దర్శకత్వం వహిస్తున్నారు.. ఇటీవల మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ ఈ మూవీ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. క్యారెక్టర్లను రివీల్ చేస్తూ రూపొందించిన వీడియోకు మంచి స్పందన వచ్చింది.

మంగళవారం ‘జయమ్మ పంచాయితీ’ లోని ‘తిప్పగలనా చూపు తిప్పగలనా’ అంటూ సాగే ఫస్ట్ లిరికల్ సాంగ్ నేచురల్ స్టార్ నాని విడుదల చేశారు. సాంగ్ చాలా బాగుంది.. ఈ సినిమా అందరికీ మంచి పేరు తీసుకురావాలి.. సుమ గారు మరింత ముందుకు దూసుకు వెళ్లాలి అన్నారు నాని. స్వరవాణి కీరవాణి ట్యూన్ కంపోజ్ చెయ్యగా.. రామాంజనేయులు అద్భుతమైన లిరిక్స్ రాశారు. పివిఎన్ఎస్ రోహిత్ అందంగా పాడారు.