×
Ad

Bigg Boss 5 Telugu : లహరిని కావాలనే ఎలిమినేట్ చేశారా..?

ప్రియకు లహరి కంటే తక్కువ ఓట్లు వచ్చాయి కానీ ఆమెను కావాలనే ఎలిమినేట్ చేశారంటున్నారు లహరి ఫ్యాన్స్..

  • Published On : September 27, 2021 / 06:27 PM IST

Lahari

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ సీజన్ 5 షో రాను రాను రసవత్తరంగా మారుతోంది. 19 కంటెస్టంట్లు ఇంట్లోకి అడుగు పెట్టగా.. ఫస్ట్ వీక్ సరయు, సెకండ్ వీక్ ఉమా దేవి, థర్డ్ వీక్ లహరి ఎలిమినేట్ అయ్యారు. సరయు, ఉమా అంటే తక్కువ ఓటింగ్‌తో పాటు ఇతరత్రా కారణాలతో ఎలిమినేట్ అయ్యారు.

Pushpa Update : సెకండ్ సింగిల్ వచ్చేస్తోంది..

కానీ లహరి ఎలిమినేట్ అవడం ఏంటబ్బా అంటూ ఆడియన్స్ షాక్ అయ్యారు. ప్రియ, రవిల వల్ల లహరి బలైంది అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. హౌస్‌లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న లహరి ఇంత త్వరగా ఎలిమినేట్ అవుతుందని ఎవరూ ఎక్స్‌పెక్ట్ చెయ్యలేదు.

Mike Tyson : ‘లైగర్’ కోసం బాక్సింగ్ లెజెండ్..

అసలు తన తప్పు లేకుండా బయటకు రావడాన్ని లహరి ఫ్యాన్స్ జీర్ణించుకోలేక పోతున్నారు. ప్రియ, రవి మధ్య జరిగిన గొడవలో లహరి బుక్ అయిపోయింది. తను బయటకు రావడానికి ఇదే ప్రధాన కారణం.. లహరి ఎలిమినేషన్ విషయంలో ఏదో మతలబు జరిగింది, ఓటింగ్ విషయానికొస్తే లహరి కంటే ప్రియకు తక్కువ ఓట్లే వచ్చాయి. కానీ కావాలనే లహరిని ఎలిమినేట్ చేశారంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

Bigg Boss 5 Telugu : ప్రియ, రవిల వల్ల లహరి బలైందా..?